Home /News /technology /

SAMSUNG TO LAUNCH GALAXY F SERIES SMARTPHONES IN INDIA ON SEPTEMBER 23 KNOW EXPECTED SPECIFICATIONS SS

Samsung Galaxy F series: సాంసంగ్ నుంచి ఎఫ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy F series: సాంసంగ్ నుంచి ఎఫ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy F series: సాంసంగ్ నుంచి ఎఫ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy F series | సాంసంగ్ నుంచి మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 23న కొత్త సిరీస్ ఫోన్లను పరిచయం చేయనుంది సాంసంగ్.

    సాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో కొత్తగా స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ చేయనుంది సాంసంగ్. ఇప్పటికే ఏ, ఎస్, ఎం సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది సాంసంగ్. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ సిరీస్ మోడల్స్‌ని కూడా పరిచయం చేయనుంది. సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే టీచర్లతో గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్ గురించి టీజర్లతో ప్రచారం చేస్తోంది సాంసంగ్. ఎఫ్ సిరీస్‌లో వచ్చే స్మార్ట్‌ఫోన్లు కెమెరా ఫోకస్డ్‌గా ఉంటాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లలో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయన్న విషయం ఇప్పటివరకైతే తెలియదు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 మోడల్ రిలీజ్ కానుందన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నాచ్, వెనుకవైపు ఫింగర్ ప్రింట్ రీడర్, అమొలెడ్ స్క్రీన్, ఎక్సినోస్ 9611 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా. అయితే ఇవన్నీ ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్సే.

    Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... ధర రూ.8,499 నుంచి

    IPL 2020: డ్రీమ్11 లో డబ్బులు గెలుచుకుంటున్నారా? ఈ తప్పు చేస్తే చిక్కులు తప్పవు



    ఇక ఇప్పటికే సాంసంగ్ నుంచి సోనీ ఐఎంఎక్స్ సెన్సార్‌తో గెలాక్సీ ఎం31ఎస్, గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇండస్ట్రీలో సోనీ కెమెరా సెన్సార్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల ఫోటోలు బాగా వస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ Sony IMX616 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 64మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్ ఉంది. వీటితో పాటు ఫోటోగ్రఫీ కోసం సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కనిపించే 'సింగిల్ టేక్' ఫీచర్ ఉంది. అయితే వీటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ కెమెరా సెంట్రిక్‌గా కొత్త మోడల్స్‌ను ఎఫ్ సిరీస్‌లో సాంసంగ్ రిలీజ్ చేయనుంది. మరి మొత్తం ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే సెప్టెంబర్ 23 వరకు ఆగాల్సిందే.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు