Samsung 4K UHD TV : ఇండియన్స్ సరికొత్త టీవీలకు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఆండ్రాయిడ్, అమోల్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దక్షిణ కొరియా కంపెనీ... శాంసంగ్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ చెయ్యబోతున్న సరికొత్త 4K UHD TV రేటు రూ.60,000 ఉండబోతోంది. మార్చి రెండో వారం నుంచీ ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇండియాలో 4K UHD TVల సిరీస్ తెస్తున్న శాంసంగ్... వీటి ప్రారంభ ధర రూ.40,000 నుంచీ మొదలవుతుందని వివరించింది. ఆన్లైన్ ఫోకస్‌గా వస్తున్న ఈ మోడల్స్‌లో చాలా ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను ఇన్‌బిల్ట్ చేస్తున్నారు. ప్రధానంగా లైవ్ కాస్ట్, మ్యూజిక్ ప్లేయర్స్, లాగ్ ఫ్రీ గేమింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.
శాంసంగ్ టీవీ (Image : Twitter)
ఈ సిరీస్ టీవీలు... 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ స్క్రీన్ సైజుల్లో లభించబోతున్నాయి. శాంసంగ్ తెస్తున్న UHD సిరీస్‌లో 2018 జూన్‌లో రిలీజ్ చేసిన రూ.64,900 ధర పలికిన 7100, 7470, 8000 series మోడల్స్ కూడా ఉండబోతున్నాయి.
మొత్తంగా బ్రాండెడ్ మొబైళ్లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ల్యాప్‌టాప్‌లూ తెచ్చిన శాంసంగ్... 4K టీవీలతో ఇండియా మార్కెట్లో తన షేర్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.