టెక్ దిగ్గజం శామ్సంగ్(Samsung) నుంచి కొత్త ట్యాబ్ (New Tab) మార్కెట్లోకి రిలీజ్ అయింది. కంపెనీ ఇటీవల ఇటలీలో(Italy) గెలాక్సీ ఎస్ ట్యాబ్(Tab) సిరీస్‌లో కొత్త బడ్జెట్ వెర్షన్‌ను విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ (Samsung Galaxy Tab S6 Lite- 2022) పేరుతో కొత్త డివైజ్ లాంచ్ అయింది. ఈ ట్యాబ్ స్నాప్‌డ్రాగన్ చిప్, పెద్ద డిస్ప్లే, శక్తివంతమైన స్పీకర్లు, పెద్ద బ్యాటరీతో వస్తుంది. ఈ సిరీస్‌లో తాజా డివైజ్ 2022 రిఫ్రెష్ ఎడిషన్‌గా (Fresh Edition) చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా దిగ్గజం Tab S6 లైట్‌ను ప్రస్తుతం యూరప్ మార్కెట్లోనే లాంచ్ చేసింది. దీన్ని అప్డేటెడ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
* గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ (2022) ధర
ఈ కొత్త బడ్జెట్ ట్యాబ్ అమెజాన్ ఇటలీలో EUR 399 ధరతో లిస్ట్ అయింది. మన కరెన్సీలో దీని ధర సుమారు రూ. 32,200 వరకు ఉండవచ్చు. ఈ లిస్టింగ్ 4GB/64GB, Wi-Fi వెర్షన్‌గా తెలుస్తోంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 459.90 (దాదాపు రూ. 37,000) వరకు ఉంటుంది. అమెజాన్ ఇటలీ ప్లాట్ఫామ్లో ఇప్పటికే దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మే 23 నుంచి ఈ డివైజ్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 (2022) లైట్ మోడల్ ప్రస్తుతం యూరప్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ఇండియాతో పాటు ఇతర మార్కెట్లలో ఈ టాబ్లెట్‌ను ఎప్పుడు విడుదల చేస్తామనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
* కొత్త ట్యాబ్ ఫీచర్లు
గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ (2022).. 8nm స్నాప్‌డ్రాగన్ 720G SoC చిప్సెట్తో వస్తుంది. ఈ టాబ్లెట్ 4GB RAM, 64GB స్టోరేజ్, అలాగే 128 GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ పొడిగించుకోవచ్చు. ట్యాబ్ S6 లైట్ 2022 వెర్షన్ Android 12 బేస్డ్ OneUI 4.1తో రన్ అవుతుంది. S పెన్ సపోర్ట్ ఉన్న 10.4 అంగుళాల FHD+ (2000 x 1200-పిక్సెల్ రిజల్యూషన్) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ 7,040 mAh బ్యాటరీతో వస్తుంది. USB టైప్-C పోర్ట్ ద్వారా దీన్ని ఛార్జ్ చేయవచ్చు. ఈ డివైజ్ AKG ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. మంచి ఆడియో అవుట్‌పుట్ కోసం స్పీకర్లు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తాయి.
ఈ Tab S6 Lite కెమెరాల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. మునుపటి మోడల్లో ఒకే 8 MP వెనుక కెమెరా ఉంది. కానీ తాజా లిస్టింగ్ వివరాల్లో మాత్రం 5 MP ఫ్రంట్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్ Wi-Fi సపోర్ట్‌తో పాటు హెడ్‌ఫోన్ జాక్, S పెన్‌తో వస్తుంది. టాబ్లెట్ 7 మిమీ మందం, 465 గ్రాముల బరువు ఉంటుంది. ఇది ఆక్స్ఫర్డ్ గ్రే కలర్లో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, Mobile phones, New mobiles, Samsung Galaxy