SAMSUNG STUDENT ADVANTAGE PROGRAM IS BACK WITH THE BEST DEALS YOU CAN GET ON PHONES AND LAPTOPS UMG GH
Samsung: సామ్సంగ్ బెస్ట్ ఆఫర్లు.. స్టూడెంట్స్ ఫోన్, ల్యాప్‌టాప్‌లు పొందే గోల్డెన్ ఛాన్స్!
సామ్సంగ్ బెస్ట్ డీల్
వేసవి సెలవులు దాదాపు పూర్తయ్యాయి. ఇది పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం. ఈ క్రమంలో శాంసంగ్ కంపెనీ ప్రసిద్ధ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ను తిరిగి తీసుకువచ్చింది.
వేసవి సెలవులు (Summer Holidays) దాదాపు పూర్తయ్యాయి. పబ్లిక్ పరీక్షలు (Public Exams) రాసిన విద్యార్థులు (Students) ఫలితాలు అందుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే కొత్త విద్యా సంవత్సరం లోకి అడుగుపెట్టనున్నారు. దాదాపు పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం. ఈ క్రమంలో సామ్సంగ్ (Samsung) కంపెనీ ప్రసిద్ధ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ను తిరిగి తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం విద్యార్థుల కోసం అనేక బెస్ట్ డీల్స్‌ను అందిస్తోంది. సరికొత్త గెలాక్సీ ట్యాబ్‌లతో, విద్యార్థులు తమ క్లాస్ ప్రాజెక్ట్‌లలో సౌకర్యవంతంగా పని చేయవచ్చు. గెలాక్సీ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచుకోవడంలో సహాయపడతాయి. విద్యార్థులకు గ్యాడ్జెట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. సామ్సంగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ కింద లభిస్తున్న డీల్స్‌ను పరిశీలించండి.
* Galaxy S, Galaxy A సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు
స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, శాంసంగ్ గెలాక్సీ S, గెలాక్సీ A సిరీస్ స్మార్ట్ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌తో ప్రారంభించి, పవర్ఫుల్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, గెలాక్సీ ఎస్22+, గెలాక్సీ ఎస్22ను 5 శాతం తగ్గింపుతో సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అత్యధికంగా అమ్ముడైన గెలాక్సీ ఎస్ సిరీస్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్20ఎఫ్ఈపై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. గెలాక్సీ ఏ73 5జీ, గెలాక్సీ ఏ53 5జీ, గెలాక్సీ ఏ33 5జీ వంటి అద్భుతమైన శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లపై కంపెనీ 5 శాతం తగ్గింపును అందిస్తోంది.
* ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్
ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఎంతో అవసరం. అధ్యయనం చేయడానికి, పని చేయడానికి, వినోదం కోసం, ఆన్లైన్ తరగతుల కోసం ఉపయోగించవచ్చు. శాంసంగ్ అద్భుతమైన కొత్త గెలాక్సీ బుక్2 సిరీస్‌పై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్ జర్నీలో కూడా సులువుగా తీసుకెళ్లేలా స్లిమ్, తేలికపాటి ల్యాప్‌టాప్‌లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ బుక్2 మోడల్‌లు తాజా Intel 12th Gen ప్రాసెసర్లతో వస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు అధిక-రిజల్యూషన్ డిస్ప్లేలు, తేలికైన డిజైన్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 10 శాతం తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ బుక్ గో, గెలాక్సీ బుక్2ని పొందవచ్చు.
* Galaxy Tab A సిరీస్‌పై సూపర్ డీల్‌లు
విద్యార్థుల అవసరాలకు టాబ్లెట్లు బెస్ట్ ఆప్షన్. స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌తో, శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ట్యాబ్ సిరీస్‌పై కొన్ని ఇర్రెసిస్టిబుల్ డీల్‌లను అందిస్తోంది. ప్రస్తుతం గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్‌ని 5 శాతం తగ్గింపుతో పొందవచ్చు. గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ భారీ 5,100mAh బ్యాటరీ, డాల్బీ అట్మాస్ సపోర్ట్, శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, స్మార్ట్ పీసీ సింక్ సపోర్ట్‌తో వస్తుంది.
ఫ్లాగ్షిప్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ టాబ్లెట్లు - గెలాక్సీ ట్యాబ్ ఎస్8, గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ కూడా 5 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ భారీ 7,040mAh బ్యాటరీతో వస్తుంది. డాల్బీ అట్మాస్‌కు సపోర్ట్ చేస్తుంది. టాబ్లెట్ ఎస్ పెన్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8, WQXGA డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ఎస్ పెన్ సపోర్ట్, 30fps వద్ద గరిష్టంగా 4K వీడియోలను క్యాప్చర్ చేయగల కెమెరా ఫీచర్లను అందిస్తోంది.
* Galaxy Buds, Galaxy Smart Watchలపై ఆఫర్లు
శాంసంగ్ వేరబుల్స్ విద్యార్థుల అవసరాలను తీర్చడమే కాకుండా వారి అంచనాలను అధిగమించడానికి ఉపయోగపడతాయి. స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌తో, శాంసంగ్ గెలాక్సీ వాచ్4ని 10 శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ నిద్రను ట్రాక్ చేస్తుంది, ఆక్సిజన్ స్థాయిలను కొలుస్తుంది. ఆరోగ్య లక్ష్యాల దిశగా పురోగతిని ట్రాక్ చేస్తుంది. ఆకర్షణీయమైన 10 శాతం తగ్గింపుతో గెలాక్సీ బడ్స్2 అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌లు టూ-వే డైనమిక్ స్పీకర్లతో బెస్ట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.
* మానిటర్లపై నమ్మశక్యం కాని డీల్‌లు
రోజూ మల్టీ టాస్కింగ్ చేయాల్సిన విద్యార్థులు ల్యాప్‌టాప్‌కు అదనపు మానిటర్ని కనెక్ట్ చేయడం వల్ల ప్రొడక్టవిటీని పెంచుకోవచ్చు. శాంసంగ్ కంపెనీ నుంచి గేమింగ్, అల్ట్రావైడ్, కర్వ్డ్, స్మార్ట్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల మానిటర్లపై 8 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. అల్ట్రావైడ్ మానిటర్లు విద్యార్థులకు ప్రోగ్రామ్‌లకు హాజరుకావడానికి, డిస్ప్లే, మల్టీ టాస్కింగ్‌ని విభజించడం ద్వారా ఒకే సమయంలో నోట్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి.
* విద్యార్థులు తగ్గింపులను ఎలా పొందాలి?
విద్యార్థులు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి విద్యార్థి ఇమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వచ్చు. విద్యార్థి ఇమెయిల్ IDని నమోదు చేయడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది.. అక్కడ ఇన్స్టిట్యూట్/కళాశాల ఆధారాలను ఎంటర్ చేయాలి. విద్యార్థి IDని అప్లోడ్ చేయవచ్చు. సమీపంలోని శాంసంగ్ ఎక్స్పీరియన్స్ స్టోర్లను కూడా సందర్శించవచ్చు. సమీప స్టోర్‌కి కనెక్ట్ అవ్వడానికి, 9870494949కి WhatsAppలో ‘స్టూడెంట్’ అని పంపాలి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.