• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SAMSUNG SMART MONITOR M5 SMART MONITOR M7 LAUNCHED IN INDIA MK GH

Samsung నుంచి రెండు సరికొత్త Smart Monitors లాంఛ్​.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​కు బెస్ట్ చాయిస్..

Samsung నుంచి రెండు సరికొత్త Smart Monitors లాంఛ్​.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​కు బెస్ట్ చాయిస్..

ప్రతీకాత్మకచిత్రం

శామ్సంగ్ అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ​మానిటర్​ను లాంఛ్​ చేసింది. దీనిలో వీడియో స్ట్రీమింగ్ యాప్స్​తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 యాప్స్​ను కూడా రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్​ మానిటర్లు​ వర్క్​ఫ్రమ్​ హోమ్ చేసే వారికి అద్భుతమైన ఆప్షన్​గా శామ్​సంగ్​ పేర్కొంది.

  • Share this:
కరోనా మహమ్మారి విజృంభనతో దాదాపు ఏడాది కాలంలో ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఇటు కంపెనీలు వర్క్​ ఫ్రం హోమ్​ విధానాన్ని అమలు చేస్తుండటం, అటు విద్యాసంస్థలు ఆన్​లైన్​ క్లాసులు బోధిస్తుండటంతో స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్స్​, డెస్క్​టాప్స్​కు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. ఈ డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని దాదాపు అన్ని ఎలక్ట్రానిక్​ తయారీ సంస్థలు పోటీపోటీగా కొత్త పరికరాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా, ప్రముఖ ఎలక్ట్రానిక్​ తయారీ సంస్థ శామ్సంగ్ అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ​మానిటర్​ను లాంఛ్​ చేసింది. దీనిలో వీడియో స్ట్రీమింగ్ యాప్స్​తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 యాప్స్​ను కూడా రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్​ మానిటర్లు​ వర్క్​ఫ్రమ్​ హోమ్ చేసే వారికి అద్భుతమైన ఆప్షన్​గా శామ్​సంగ్​ పేర్కొంది. M7, M5 అనే రెండు మోడళ్లలో ఇవి లభిస్తాయి. M7 మోడల్​ 32 -అంగుళాల డిస్​ప్లేతో వస్తుండగా.. M5 మోడల్​ మాత్రం 27తో పాటు 32 -అంగుళాలలో డిస్​ప్లేతో లభిస్తుంది.

M5 మోడల్​లో అల్ట్రా HD లేదా 4K రిజల్యూషన్ స్క్రీన్.. M5 మోడల్​లో ఫుల్​ హెచ్​డీ రిజల్యూషన్​ డిస్​ప్లేను అందించారు. తమ కొత్త ప్రోడక్ట్​ లాంఛింగ్​పై శామ్‌సంగ్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ హెడ్​ పునీత్ సేథి మాట్లాడుతూ.. “కరోనా కారణంగా ప్రస్తుతం ఇల్లు కార్యాలయంగా మారింది. ఇప్పుడు ఎక్కువ మంది వినియోగదారులు ఇంటి నుండే పనిచేస్తున్నందున మానిటర్లకు డిమాండ్ పెరుగుతోంది.

భారతీయ ప్రీమియం మానిటర్ల విభాగంలో మేం అగ్రస్థానంలో ఉండాలనుకుంటున్నాం. గత కొంత కాలంగా మా వ్యాపారం దాదాపు 60 శాతం పెరిగింది. దీనిలో ప్రీమియం మానిటర్ల వాటానే 40 శాతంగా ఉంది. ఈ ఏడాది ప్రీమియం మానిటర్ల మార్కెట్ 150 శాతానికి పైగా పెరుగుతుందని ఆశిస్తున్నాం.” అని ఆయన తెలిపారు.

శామ్సంగ్ M5, M7 స్మార్ట్ మానిటర్ ఫీచర్లు
1. శామ్సంగ్ M7 మానిటర్ 3840 x 2160p రిజల్యూషన్​​ గల అల్ట్రా HD డిస్​ప్లే.. M5 మానిటర్​ 1920 x 1080 రిజల్యూషన్​ గల ఫుల్​ HD డిస్​ప్లేలను కలిగి ఉంటాయి. ఇవి టిజెన్ 5.5 ప్రాసెసర్​పై పనిచేస్తాయి.
2. వైఫై ద్వారా శామ్సంగ్ టీవీ ప్లస్​కు కనెక్ట్​ చేసుకొని ఈ మానిటర్లలో ప్రీమియం కంటెంట్​ను ఆస్వాదించవచ్చు. ఇది బిక్స్​​బీ స్మార్ట్ అసిస్టెంట్ సపోర్ట్​తో వస్తుంది.
3. రెండు మానిటర్లలో స్పీకర్ అవుట్​పుట్ 10W ఉంటుంది. ఈ రెండింటిలోనూ 2 HDMI పోర్ట్‌లను అందించింది. M7లో 3 USB 2.0 పోర్ట్‌, M5లో రెండు USB 2.0 పోర్ట్‌లను చేర్చింది.
4. M7 మోడల్​లో టైప్-సి పోర్టును అందించగా.. M5లో ఈ పోర్ట్​ లభించదు. దీనిలోని USB-C పోర్ట్ 65W ఛార్జింగ్​కు మద్దతు ఇస్తుంది. కాగా రెండు మానిటర్లు వై-ఫై, బ్లూటూత్ 4.2కి కూడా సపోర్ట్​ ఇస్తాయి.
5. ఈ రెండు మానిటరల్లో ఐ సేవర్ మోడ్, ఇంటెలిజెంట్ ఐ కేర్ మోడ్​లను అందించారు.
6. శామ్సంగ్ స్మార్ట్ మానిటర్​ డిస్​ప్లేలు 16: 9 నుండి 21: 9 వరకు కారక నిష్పత్తిని కలిగి ఉంటాయి. ఇవి గేమింగ్​ సమయంలో అద్భుతమైన వీక్షణను అందిస్తాయి.

ధర, లభ్యత
శామ్సంగ్ స్మార్ట్ మానిటర్లు బడ్జెట్​ ధరకే అందుబాటులో రానున్నాయి. M5, M7 వేరియంట్లు రూ .28,000 నుంచి రూ. 57,000 మధ్య లభిస్తాయి. కాగా, ఈ స్మార్ట్​ మానిటర్లను శామ్‌సంగ్ అవుట్​లెట్​ సెంటర్లు. అమెజాన్ వంటి ప్రముఖ ఈ–కామర్స్​ వెబ్​సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
First published:

అగ్ర కథనాలు