హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Satellite Connectivity: శామ్‌సంగ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కూడా శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్.. ఐఫోన్ 14కు పోటీ.. వివరాలివే..

Satellite Connectivity: శామ్‌సంగ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కూడా శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్.. ఐఫోన్ 14కు పోటీ.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Satellite Connectivity: యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో శాటిలైట్ కనెక్టివిటీ ఆప్షన్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే శామ్‌సంగ్‌ కూడా శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్‌ ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్దమైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యాపిల్ (Apple) సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో శాటిలైట్ కనెక్టివిటీ (Satellite Connectivity) ఆప్షన్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. నెట్‌వర్క్ లేని మారుమూల ప్రదేశాల్లో కూడా ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపించేందుకు ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు సెల్యులార్, వైఫై సిగ్నల్స్ (Wifi Signals) లేని ప్రాంతాల్లో అంతరాయాలు లేని కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. ఈ ఫీచర్ నవంబర్‌లో ఐఫోన్ 14 మోడల్స్‌లో వర్క్ అయ్యే అవకాశం ఉంది. అయితే తాజాగా స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం శామ్‌సంగ్‌ (Samsung) కూడా శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది.

యాపిల్ యూఎస్, కెనడాలోని యూజర్లకు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందుబాటులో తేస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సర్వీస్ ప్రారంభం కానుండగా.. ఇది మొదటి రెండు సంవత్సరాలు పూర్తిగా ఉచితం. ఐఫోన్లలోని శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా యూజర్లు ఎమర్జెన్సీ SOS పంపించవచ్చు.

ఆకాశంలో మేఘాలు లేకుండా నిర్మలమైన పరిస్థితి ఉంటే ఒక సాధారణ SOS మెసేజ్ పంపడానికి 15 సెకన్లు పడుతుంది లేదా మేఘావృతమైన సమయంలో కొద్ది నిమిషాల టైమ్ పడుతుంది. ఇలాంటి ఉపయోగకరమైన ఫీచర్‌ను త్వరలోనే శామ్‌సంగ్‌ కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమైందని వస్తున్న వార్తలు ఇప్పుడు టెక్ ప్రియులలో ఆసక్తిని రేపుతున్నాయి.

* శామ్‌సంగ్‌ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్

ప్రీమియం మొబైల్స్ అయిన గెలాక్సీ S సిరీస్ (Galaxy S series) ఫోన్లలో ఈ అధునాతన టెక్నాలజీని శామ్‌సంగ్‌ పరిచయం చేసే అవకాశం ఉందని తాజా రిపోర్ట్ తెలిపింది. 2023లో గెలాక్సీ S23 లైనప్ ఫోన్స్ రిలీజ్ కానున్నాయి. మొదటగా ఈ ఫోన్లలోనే శాటిలైట్ టెక్నాలజీని అందించొచ్చని రిపోర్ట్ పేర్కొంది. ఆ తర్వాత ఫోల్డబుల్-సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో దీన్ని పరిచయం చేయొచ్చు.

ఇది కూాడా చదవండి : వాట్సాప్‌ నుంచి అదిరే ఫీచర్.. బిజీగా ఉన్నా ఆటోమెటిక్‌గా ఇలా రిప్లై ఇవ్వొచ్చు..

ఈ ఫీచర్‌ వర్క్ అయ్యేందుకు శామ్‌సంగ్‌ ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసులపై ఆధారపడొచ్చని సమాచారం. స్టార్‌లింక్ సంస్థ ప్రస్తుతానికి 40 వరకు దేశాల్లో శాటిలైట్ సర్వీసులు ఆఫర్ చేస్తోంది. దానివల్ల శామ్‌సంగ్‌ ఎక్కువ దేశాల్లో తన శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ అందించే అవకాశం ఉంటుంది.

ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్లకు ఈ ఫీచర్‌ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో గూగుల్ తన ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుందని సమాచారం. దీనికోసం అవసరమైన హార్డ్‌వేర్‌ను అందించవచ్చు. కాగా అప్‌కమింగ్ Pixel 7 సిరీస్‌లో ఈ ఫీచర్ వస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, రాబోయే మేట్ 50 సిరీస్‌లో Huawei కంపెనీ సైతం ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక యాపిల్ గ్లోబల్‌స్టార్‌తో కలిసి చరిత్రలోనే తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా శాటిలైట్ కనెక్టివిటీని తీసుకొచ్చి ట్రెండ్ సెటర్ అయింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Iphone 14, Samsung, Samsung Galaxy, Tech news

ఉత్తమ కథలు