సాధారణంగా మామూలు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు కాకుండా, ప్రీమియం ఫోన్లతో ఇచ్చే ఛార్జర్లనే కంపెనీలు ప్యాకేజింగ్ నుంచి తీసివేస్తున్నాయి. భవిష్యత్తులో సాంసంగ్ నుంచి రానున్న మరిన్ని డివైజ్‌లతోనూ ఈయర్ఫోన్లు, ఛార్జర్లను ఇవ్వకూడదని నిర్ణయించింది.
యాపిల్, సాంసంగ్, షావోమీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త స్మార్ట్ఫోన్లతో ఛార్జర్లను, ఈయర్ఫోన్లను ఇవ్వకూదని నిర్ణయించుకున్నాయి. గతంలో యాపిల్ ఐఫోన్-12ను లాంచ్ చేసినప్పుడు కస్టమర్లకు ఛార్జర్, ఈయర్ఫోన్లు ఇవ్వలేదు. షావోమీ కూడా ఇటీవల చైనాలో విడుదల చేసిన ఎంఐ 11 స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్‌ను ఇవ్వలేదు. వీటి ఛార్జింగ్ కోసం తమవద్ద ఉన్న పాత యాక్సెసరీలనే వాడుకోవాలని ఆ సంస్థలు కస్టమర్లకు సూచించాయి. ముందు యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాంసంగ్, షావోమీ కంపెనీలు విమర్శించాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించడం తమ బాధ్యత అంటూ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్‌ను ట్రోల్ చేశాయి. కానీ యాపిల్ సెట్ చేసిన ఈ ట్రెండ్‌ను ప్రస్తుతం మిగతా కంపెనీలు సైతం ఫాలో అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో సాంసంగ్ కూడా చేరింది. ఆ సంస్థ నుంచి త్వరలో రానున్న గెలాక్సీ ఎస్ 21 (Galaxy S21) స్మార్ట్ ఫోన్‌తో కస్టమర్లకు ఛార్జర్లు, ఈయర్ఫోన్లు ఇవ్వట్లేదని ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్ లేని సాంసంగ్ కస్టమర్లు విడిగా కొత్తవాటిని కొనుగోలు చేయాల్సిందే. వినియోగదారులకు కేవలం USB-C to USB-C కేబుల్‌ను మాత్రమే ఆ సంస్థ ఉచితంగా అందిస్తుంది.
పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యాపిల్, సాంసంగ్ , షావోమీ కంపెనీలు చెబుతున్నాయి. కొత్త ఫోన్లను కొన్నవారు తమవద్ద ఉండే పాత ఛార్జర్లను వాడుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. వినియోగదారులు తమ వద్ద ఇప్పటికే ఉన్న యాక్సెసరీలను తిరిగి ఉపయోగిస్తున్నారని సాంసంగ్ చెబుతోంది. రీసైక్లింగ్ అలవాట్లను, సస్టెయినబుల్ డెవలప్మెంట్ అలవాట్లను ఇలాంటి చర్యలు ప్రోత్సహిత్సాయని ఆ సంస్థ ప్రకటించింది. సాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్ల నుంచి మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్‌ను కూడా తొలగించింది. దీంతో ఇప్పుడు కొత్త సాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్లో పాత మైక్రో ఎస్డి కార్డ్‌ను ఉపయోగించే అవకాశం లేదు.
సాధారణంగా మామూలు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు కాకుండా, ప్రీమియం ఫోన్లతో ఇచ్చే ఛార్జర్లనే కంపెనీలు ప్యాకేజింగ్ నుంచి తీసివేస్తున్నాయి. భవిష్యత్తులో సాంసంగ్ నుంచి రానున్న మరిన్ని డివైజ్‌లతోనూ ఈయర్ఫోన్లు, ఛార్జర్లను ఇవ్వకూడదని నిర్ణయించింది. స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్లతో కస్టమర్లకు అదనంగా ఇచ్చే యాక్సెసరీలను ప్యాకేజింగ్ నుంచి క్రమంగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. కానీ USB Type-C ఛార్జింగ్ పోర్ట్‌లను మాత్రం అందిస్తామని సాంసంగ్ హామీ ఇచ్చింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.