Home /News /technology /

Samsung Galaxy A22: త్వరలోనే శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్.. తక్కవ ధర, అదిరే ఫీచర్లతో..

Samsung Galaxy A22: త్వరలోనే శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్.. తక్కవ ధర, అదిరే ఫీచర్లతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ ఇండియాలో తమ కొత్త గెలాక్సీ ఏ22 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. 5జీ టెక్నాలజీతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉన్నట్లు టీయువి రీన్‌ల్యాండ్ వెబ్‌సైట్‌ తెలిపింది.

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఇందులో భాగంగా అతి త్వరలోనే భారత్‌లో కొత్త గెలాక్సీ ఏ22 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. 5జీ టెక్నాలజీతో వచ్చే ఈ డివైజ్‌లో.. 15W ఛార్జింగ్ సపోర్ట్‌ ఉన్నట్టు టియువి రీన్‌ల్యాండ్ వెబ్‌సైట్‌ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి గత కొన్ని నెలలుగా వివిధ వెబ్‌సైట్లలో లీకులు వస్తున్నాయి. ఇది 4G, 5G రెండు వేరియంట్లలో లభించనుందని తెలుస్తోంది. అతి త్వరలోనే గెలాక్సీ A22 5G తో పాటు గెలాక్సీ F22ను లాంచ్ చేయనున్నట్లు తెలుసోంది. టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ టియువి రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్ నుంచి తీసిన స్క్రీన్‌షాట్‌ను ట్వీట్టర్లో పంచుకున్నారు. మోడల్ నంబర్ SM-A226Bతో శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G వేరియంట్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.
Realme C20A: రియల్ మీ నుంచి త్వరలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలివే..
Television Price: టీవీ కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. త్వరలో పెరగనున్న టీవీల ధరలు.. వెంటనే కొనేసుకోండి

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G ధర..
A22 5G వేరియంట్ KRW 2,00,000 (సుమారు రూ. 13,100) ధరతో విడుదల కానుందని తెలుస్తోంది. ఇది లైట్ గ్రీన్, వైట్ షేడ్స్ సహా మొత్తం నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో లభించనుందని ప్రాథమిక సమాచారం. అయితే, ఇది ఎప్పుడు లాంఛ్ అవుతుందనే విషయంపై స్పష్టత లేదు.


గెలాక్సీ A22 5G స్పెసిఫికేషన్లు
శామ్‌సంగ్ A22 5G స్మార్ట్‌ఫోన్ 6.5- అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్‌తో పనిచేయనుంది. దీంట్లో 6GB RAMని అందించినట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేయనుంది. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 స్మార్ట్ఫోన్లో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌లు ఉండవచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు, వీటితో పాటు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలతో ఈ డివైజ్‌ను రూపొందించారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobiles, Samsung, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు