Samsung foldable smartphones | ఫీచర్ ఫోన్ల హవా నడుస్తున్నప్పుడు మడతపెట్టే ఫోన్లకు క్రేజ్ ఉండేది. ఇప్పుడు మడతపెట్టే స్మార్ట్ఫోన్లు కూడా వచ్చేస్తున్నాయి. సాంసంగ్ నుంచి మూడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ రానున్నాయి.
స్మార్ట్ఫోన్ల తయారీ విభాగంలో Samsung సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పోటీ కంపెనీలకు ధీటుగా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ఫోన్లను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ఆ సంస్థ మడతపెట్టగలిగే స్మార్ట్ఫోన్ల తయారీపై దృష్టిసారించింది. ఈ విభాగంలోని Galaxy Z Fold వేరియంట్లను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో మొత్తం మూడు సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ఆ సంస్థ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం Galaxy Z Fold 3, Galaxy Z Flip 2 వేరియెంట్లను Samsung అభివృద్ధి చేస్తోంది. Galaxy Z Fold Lite మోడల్ వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో ఏడు అంగుళాల ఇంటర్నల్ ఫోల్డబుల్ స్క్రీన్, బయట వైపు నాలుగు అంగుళాల డిస్ప్లే ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Galaxy Z Fold Lite స్మార్ట్‌ఫోన్ ముందునుంచి వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ మోడల్‌ను Samsung రూపొందిస్తోందనే వార్తలు వచ్చాయి. Galaxy Z Fold 3 స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇది under display front camera, S Pen support వంటి ఫీచర్లతో లభించనుంది. బ్యాటరీని సమర్థవంతంగా వాడే LTPO screen technologyతో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీని లోపలి భాగంలో ఏడు అంగుళాల foldable display, నాలుగు అంగుళాల cover screen ఉన్నాయి.
Galaxy Z Fold 3 స్మార్ట్‌ఫోన్‌ను 60 మైక్రోమీటర్ల మందంతో, ultra thin glassతో అభివృద్ధి చేశారు. ఇది Galaxy Z Fold 2తో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ స్మార్ట్‌ఫోన్ మందం 30 మైక్రోమీటర్లుగా ఉంటుంది. ఎక్కువ మందంగా ఉండే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు ఒత్తిడిని తట్టుకోగలవు. కానీ ఇవి తక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి. స్క్రీన్ ఏరియాను మరింత సరళంగా అభివృద్ది చేయడానికి Samsung Display జర్మనీకి చెందిన LPKF సంస్థతో కలిసి పనిచేస్తోంది. Galaxy Z Fold 3, Galaxy Z Flip 2 స్మార్ట్ఫోన్లు 2021 సంవత్సరం మూడో త్రైమాసికంలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.