Samsung Galaxy M Series: గెలాక్సీ ఎం10, ఎం20 రిలీజ్ చేసిన సాంసంగ్

షావోమీ, రియల్‌మీ, ఏసుస్, హానర్ లాంటి బ్రాండ్లను టార్గెట్‌ చేస్తూ ఎం10, ఎం20 రిలీజ్ చేసింది సాంసంగ్. ఫిబ్రవరి 5 నుంచి అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది. 

news18-telugu
Updated: January 29, 2019, 12:28 PM IST
Samsung Galaxy M Series: గెలాక్సీ ఎం10, ఎం20 రిలీజ్ చేసిన సాంసంగ్
గెలాక్సీ ఎం10, ఎం20 రిలీజ్ చేసిన సాంసంగ్
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాంసంగ్... సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. 'ఇన్ఫినిటీ-వీ' పేరుతో తొలిసారిగా నాచ్ డిస్‌ప్లేతో సాంసంగ్ రూపొందించిన ఫోన్లు ఇవి. షావోమీ, రియల్‌మీ, ఏసుస్, హానర్ లాంటి బ్రాండ్లను టార్గెట్‌ చేస్తూ ఎం10, ఎం20 రిలీజ్ చేసింది సాంసంగ్. ఫిబ్రవరి 5 నుంచి అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది. జియో కస్టమర్లకు రూ.198, రూ.299 ప్లాన్స్‌పై డబుల్ డేటా లభిస్తుంది. రూ.198 రీఛార్జ్‌పై ఆ తర్వాత 10 రీఛార్జులకు రూ.3,110 లాభాలు ఉంటాయి.

Read This: IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+, 1520x720 పిక్సెల్స్


ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7870
Loading...
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్
ధర:
2జీబీ+16జీబీ- రూ.7,990
3జీబీ+32జీబీ- రూ.8,990

Read This: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల హెచ్‌డీ+, 2340x1080 పిక్సెల్స్
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7904
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- రూ.10,990
4జీబీ+64జీబీ- రూ.12,990

ఇవి కూడా చదవండి:

Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?

మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
First published: January 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com