Samsung Washing Machine | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా కొత్త వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. అలాగే ఈ వాషింగ్ మెషీన్లో వైఫైతో (WiFi) కూడిన స్మార్ట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా హైజెనీ స్టీమ్ ఫీచర్ కూడా ఉంది. దుస్తుల శానిటైజ్కు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎకోబబుల్ సీరిస్ కింద శాంసంగ్ ఈ వాషింగ్ మెషీన్లను (Washing Machines) ఆవిష్కరించింది. అంటే వీటిల్లో డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది.
శాంసంగ్ ఈ కొత్త ఎకోబబుల్ వాషింగ్ మెషీన్ ధర రూ. 19 వేల నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ. 35 వేల వరకు ఉంటుంది. మీరు ఎంచుకునే మోడల్ ప్రాతిపదికన వాషింగ్ మెషీన్ ధర కూడా మారుతూ ఉంటుంది. శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్, శాంసంగ్ షాప్, రిటైల్ స్టోర్స్, ఇతర ఇకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వాషింగ్ మెషీన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనొచ్చు.
Bank అకౌంట్ ఉన్న వారికి అలర్ట్.. ఈ 7 రకాల సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిందే!
ఈ కొత్త వాషింగ్ మెషీన్లలోని హైజెనీ స్టీమ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే.. ఇన్‌బిల్ట్‌గా హీటర్ ఉంటుంది. ఇది బట్టలను 99.9 శాతం శానిటైజ్ చేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇకపోతే ఈ వాషింగ్ మెషీన్లు 10 కేజీలు, 7 కేజీలు సామర్థ్యంతో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయొచ్చు.
రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందా? పెరుగుతుందా? ఈ రోజు రేట్లు ఇవే!
ఇంకా ఈ వాషింగ్ మెషీన్లలో సూపర్ స్పీడ్ టెక్నాలజీ ఉంది. అంటే ఏ వాష్ ఆప్షన్ అయినా 29 నిమిషాల్లో పూర్తి అవుతుంది. శాంసంగ్ స్మార్ట్‌థింగ్స్ యాప్ ద్వారా ఈ వాషింగ్ మెషీన్‌ను ఆపరేట్ చేయొచ్చు. వైఫై కచ్చితంగా ఉండాలి. అలాగే యాప్ ద్వారా అయితే అదనపు వాష్ ప్రోగ్రామ్స్ కూడా పొందొచ్చు. శారీ సైకిల్ ఆప్షన్ అనేది కేవలం భారతీయుల కోసమే అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా కస్టమర్లకు ఈ కొత్త వాషింగ్ మెషీన్లు 12 ఏళ్ల వారంటీతో లభిస్తున్నాయి. డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌కు ఈ వారంటీ లభిస్తుంది. అలాగే వాషింగ్ మెషీన్‌పై 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. అంతేకాకుండా కొనుగోలుదారులకు ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈఎంఐ నెలకు రూ. 990 నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే 12.5 శాతం క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Samsung, Samsung Galaxy