Home /News /technology /

SAMSUNG MAY SOON LAUNCH SAMSUNG GALAXY A03S ENTRY LEVEL SMARTPHONE IN INDIA NS GH

Samsung Galaxy A03s: శామ్‌సంగ్ నుంచి త్వరలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ నుంచి త్వరలో మరో కొత్త మోడల్ విడుదల కానుంది. సంస్థ నుంచి గతంలో వచ్చిన గెలాక్సీ A సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి లాంఛ్ చేయనుంది.

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ నుంచి త్వరలో మరో కొత్త మోడల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సంస్థ నుంచి గతంలో వచ్చిన గెలాక్సీ A సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి లాంఛ్ చేయనుంది. తాజాగా రానున్న డివైజ్‌ మోడల్ పేరు గెలాక్సీ A03s (Galaxy A03s). దీని విడుదల గురించి సంస్థ అధికారికంగా స్పందించలేదు. కానీ గెలాక్సీ ఏ03ఎస్ స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్‌ కోసం శామ్‌సంగ్ దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ మోడల్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ డివైజ్ మోడల్ నంబర్ SM-A037F/DSగా ఉన్నట్లు బీఐఎస్‌ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు ఈ కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు సైతం ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గెలాక్సీ A03s వేరియంట్‌ ఒక ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ అని తెలుస్తోంది. శామ్‌సంగ్ గతంలో విడుదల చేసిన గెలాక్సీ A02s మోడల్‌కు కొనసాగింపుగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించింది. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఈ డివైజ్ రానుంది. ఇందులో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ హ్యాండ్‌సెట్‌లో ఉంటుంది.
OPPO Reno 6: ఒప్పో రెనో 6 సిరీస్ లాంచింగ్ డేట్ వచ్చేసింది.. ఫీచర్లేంటి? ధర ఎంత ఉండొచ్చు?
Smartphone Antivirus App: స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ యాప్ అవసరమా? తెలుసుకోండి

వీటితో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టుతో హ్యాండ్‌సెట్‌ రానుందని లీకైన సమాచారం వెల్లడిస్తోంది. గెలాక్సీ A03s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 460 చిప్‌సెట్, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఇతర కనెక్టివిటీ ఫీచర్లతో రానుంది. భారత్‌లో దీని ధర రూ.15,000 లోపే ఉండే అవకాశం ఉంది.
Vodafone Prepaid Plan: రూ. 100లోపే Vi అన్‌లిమిటెడ్ ప్లాన్.. Jio, Airtel నుంచి కూడా ఇలాంటి ప్లాన్లు.. వివరాలివే
Smartphones: ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, ఈ నెలలో విడుదల కానున్న 4 స్మార్ట్ ఫోన్లు ఇవే..

శామ్‌సంగ్‌ తాజాగా గెలాక్సీ ఏ22 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,499. ఆక్టా కోర్ ప్రాసెసర్, మీడియాటెక్ హెలియో జీ80, 6జీబీ ర్యామ్‌.. వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజీ, 6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లే ఈ హ్యాండ్‌సెట్‌ను అభివృద్ధి చేశారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Samsung, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు