దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సాంసంగ్ 600 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. టిప్‌స్టర్ తన ట్వీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... 4కె, 8కె వీడియో రికార్డింగ్ టెక్నాలజీతో సాంసంగ్ ఈ భారీ కెమెరా సెన్సార్‌ను అభివృద్ధి చేస్తుంది. మనిషి కంటి కంటే చాలా శక్తివంతమైన కెమెరా సెన్సార్‌తో ఇది అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా టెక్నాలజీ రంగంలో కెమెరా రెజల్యూషన్ పట్ల కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మధ్య కాలంలో వస్తున్న అన్ని స్మార్ట్ఫోన్లు ఉత్తమ కెమెరాలను అందిస్తున్నాయి. అయితే, స్మార్ట్ఫోన్లలో ఉత్తమ పిక్సెల్‌ను అందించాలంటే మాత్రం పెద్ద సెన్సార్లను జోడించాలి. DSLR కెమెరా తయారీదారులు కూడా సెన్సార్ సామర్థ్యాల పరంగా ఉత్తమ పిక్సెల్ కెమెరాలను అందిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా నుంచి ఇటీవల విడుదలైన లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లో ఉత్తమ ప్రాసెసర్లు, భారీ సెన్సార్లను ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో హై రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీయగలిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు ఉత్తమ ఆవిష్కరణలు తీసుకురావడంలో ముందుండే సాంసంగ్ కంపెనీ 600 మెగాపిక్సెల్ లెన్స్‌తో వచ్చే కెమెరాను అభివృద్ధి చేస్తుంది.
4కె, 8కె వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి...
600 కెమెరా సెన్సార్‌ను అందుబాటులోకి తెచ్చి మార్కెట్లో తమ ఉత్పత్తులను మరింతగా విస్తరించాలని సాంసంగ్ యోచిస్తోంది. కాగా, నూతనంగా విడుదల కాబోయే 600 ఎంపి సాంసంగ్ కెమెరా ISOCELL సెన్సార్‌పై పనిచేయనుంది. ఈ ఫోన్‌తో మనం వీడియో తీసేటప్పుడు, జూమ్ చేసినప్పుడు 4కె, 8కె వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందని టిప్‌స్టర్ ఐస్యూనివర్స్ ట్విట్టర్లో లీక్ చేసిన స్క్రీన్ షాట్స్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లో 600 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొస్తే కెమెరా బంప్ 22 మిల్లీ మీటర్ల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫోన్ వెనుక భాగంలో 12 శాతం స్టోరేజ్‌ను ఆక్రమిస్తుంది. ప్రస్తుతానికి ఈ కెమెరా ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు, భవిష్యత్‌లో దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కాగా, ప్రస్తుతం, దీని గురించి సాంసంగ్ అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.