HOME »NEWS »TECHNOLOGY »samsung may be removing charger and earphones from galaxy s21 box ss

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు
Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone | ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ కొంటే ఫోన్‌తో పాటు ఇయర్‌ఫోన్స్, ఛార్జర్, కేబుల్ వచ్చేవి. ఇకపై బాక్సులో స్మార్ట్‌ఫోన్ మాత్రమే ఉండబోతోంది.

  • Share this:
    మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ గెలాక్సీ 21 స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఆ ఫోన్‌తో పాటు ఛార్జర్ రాకపోవచ్చు. ఛార్జర్ మాత్రమే కాదు ఇయర్‌ఫోన్స్ కూడా ఉండవు. ఇప్పటికే యాపిల్ ఇలాంటి యాక్సెసరీస్ లేకుండా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లను అమ్మాలని నిర్ణయించుకుంది. బాక్సులో ఛార్జర్లు తీసెయ్యడం ద్వారా ఏటా 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను అడ్డుకోగలుగుతున్నామని, అంటే ఏటా 450,000 కార్లు రోడ్లపైకి రాకపోవడంతో సమానమని యాపిల్ ప్రకటించింది. ఛార్జర్ లేకపోవడంతో బాక్స్ సైజ్ కూడా తగ్గుతుంది. గతేడాది ఐఫోన్ బాక్సుల డెలివరీతో పోలిస్తే ఈసారి అంతే స్పేస్‌లో 70 శాతం ఎక్కువ బాక్సుల్ని డెలివరీ చేయొచ్చని అంచనా. దీంతో పాటు ప్రొడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు సాంసంగ్ కూడా అదే దారిలో నడుస్తుందన్న వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్లు అమ్మే రెండో బడా కంపెనీగా సాంసంగ్ రికార్డ్ సృష్టించడం ఖాయం. ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఛార్జర్లు ఉండవన్న వార్త యాపిల్ ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు... ఈ వార్త స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చైనాకు చెందిన బడా స్మార్ట్‌ఫోన్ కంపనీ షావోమీ అయితే యాపిల్‌ను టీజ్ చేసేలా ఓ ట్వీట్ కూడా చేసింది. బాక్సులో మేము ఏమీ అన్నీ ఇస్తాం అనేలా ఓ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ ట్వీట్ ఇదే.

    Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్



    Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ


    ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 బాక్సులో ఛార్జర్ ఉండదన్న వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేకపోవచ్చని సాంసంగ్ గెలాక్సీ ఎస్21 బాక్సులో కేవలం ఇయర్‌ఫోన్స్ మాత్రమే తొలగించి ఛార్జర్‌ ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ తొలగించడం ద్వారా సాంసంగ్ గెలాక్సీ బడ్స్ ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ని ప్రమోట్ చేయనుంది కంపెనీ. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఛార్జర్లు, ఇతర యాక్సెసరీస్ తొలగిస్తారన్న వార్తలు ఇప్పట్లో కావు గతంలో కూడా వచ్చాయి. ప్రొడక్ట్స్ తయారు చేసే ఖర్చును తగ్గించడంతో పాటు ఇ-వేస్ట్ తగ్గించడం ఈ నిర్ణయం వెనుక కారణం. యాపిల్, సాంసంగ్ లాంటి కంపెనీలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మిగతా కంపెనీలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది.

    Oppo A33: భారీ డిస్కౌంట్‌తో ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్ సేల్

    Android apps: అలర్ట్... వెంటనే ఈ 21 యాప్స్ డిలిట్ చేయండి

    గతంలో స్మార్ట్‌ఫోన్లు కొంటే బాక్సులో ఛార్జర్, కేబుల్‌తో పాటు ఇయర్‌ఫోన్స్ కూడా వచ్చేవి. కొంతకాలం తర్వాత ఇయర్‌ఫోన్స్‌ను ఇవ్వడం ఆపేశాయి కంపెనీలు. ప్రస్తుతం వచ్చే బాక్సుల్లో కేవలం ఛార్జర్లు ఉంటున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఇయర్‌ఫోన్స్ ఇస్తున్నాయి. చాలావరకు కంపెనీలు ప్రొటెక్టీవ్ కవర్స్ ఇస్తున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:October 28, 2020, 10:19 IST

    टॉप स्टोरीज