Samsung Galaxy M33: దక్షిణ కొరియా స్మార్ట్ దిగ్గజం శామ్సంగ్ నుంచి త్వరలోనే గెలాక్సీ M33 5G లాంచ్ కానుంది. 91 మొబైల్స్ నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని శామ్సంగ్ ఫ్యాక్టరీలో శామ్సంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.
దక్షిణ కొరియా(South Korea) స్మార్ట్ దిగ్గజం శామ్సంగ్(Samsung) నుంచి త్వరలోనే గెలాక్సీ M33 5G లాంచ్ కానుంది. 91 మొబైల్స్ నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని శామ్సంగ్ ఫ్యాక్టరీలో శామ్సంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్(Smartphone) ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్(Launch) అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించడం కూడా ఈ వార్తకు బలాన్ని చేకూర్చుతుంది. బీఐఎస్ లిస్టింగ్‌లో శామ్సంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లను పేర్కొంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ M32 5Gకి సక్సెసర్‌గా వస్తోంది. కాగా, శామ్సంగ్ గెలాక్సీ M33 5G లాంచింగ్ డేట్, ధర లేదా స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఫీచర్ల వివరాలు..
శామ్సంగ్ గెలాక్సీ M33 5G బీఐఎస్ లిస్టింగ్‌లో కనిపించింది. ఆన్లైన్లో లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ SM-M336BU/DS డ్యూయల్-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో 6 జీబీ ర్యామ్ అందించనుంది. ఈ ఫోన్ మల్టిపుల్ మెమరీ/ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1200 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే చిప్‌సెట్‌ను శామ్సంగ్ గెలాక్సీ ఎ53 5జీలో కూడా ఉపయోగించడం విశేషం. శామ్సంగ్ గెలాక్సీ M33 5G ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్- ది- బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది.
గెలాక్సీ M33 5G డివైజ్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అయితే దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా? లేదా? అనే విషయంపై శామ్సంగ్ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఈ ఏడాది విడుదల చేయబోయే అనేక స్మార్ట్ఫోన్లలో శామ్సంగ్ కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఉపయోగించనున్నట్లు గతంలోనే పేర్కొంది.
అందువల్ల విడుదలకు సిద్దమవుతోన్న గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సైతం ఆండ్రాయిడ్ 12- బేస్డ్ వన్ UI 4.0 ఓఎస్‌ను అందించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకైనప్పటికీ.. ధర, కలర్ వేరియంట్లపై ఎటువంటి స్పష్టత లేదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.