Home /News /technology /

SAMSUNG M20 VS HONOR 8X WHICH MOBILE IS BEST AMONG SAMSUNG M20 HONOR 8X SK

HONOR 8X vs Samsung M20: మీరు ఏ స్మార్ట్‌ఫోన్ కొనాలి?

హానర్ 8ఎక్స్, శామ్‌సంగ్ ఎం20,

హానర్ 8ఎక్స్, శామ్‌సంగ్ ఎం20,

మరి HONOR 8X, Samsung M20లో ఏది బెస్ట్? ఏ ఫోన్ కొంటే బాగుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాంటే ఈ రెండు ఫోన్ల పనితీరుని పోల్చి చూడాలి. అప్పుడే ఓ నిర్ణయానికి రావొచ్చు.

  సాధారణంగా మీరు బడ్జెట్‌లో మంచి నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌ గురించి ఆలోచించడం సహజం. కానీ అవి ఒకేలా తయారవుతాయి. ప్రస్తుతం వినియోగదారులు కొన్ని మినహాయింపులతో చౌక ధరకు ప్రత్యేక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి ఇష్టపడుతున్నారు. HONOR 8X, Samsung M20లు సరికొత్త టెక్నాలజీ, ప్రత్యేక ఫీచర్లతో ప్రస్తుత భారతీయ మార్కెట్‌లో ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.  మరి వీటిలో ఏది బెస్ట్? ఏ ఫోన్ కొంటే బాగుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాంటే  ఈ రెండు ఫోన్ల పనితీరుని పోల్చి చూడాలి.  అప్పుడే ఓ నిర్ణయానికి రావొచ్చు.  HONOR 8X, Samsung M20  వివరాలను ఇక్కడ చూడండి.

  బిల్డ్ అండ్ డిజైన్
  విజువల్ గ్రేటింగ్ ఎఫెక్ట్‌తో కూడిన గ్లాస్ బాడీ గల HONOR 8X చూడగానే కొనాలనిపిస్తుంది. దాని మ్యాట్-ఫినిష్ అల్యూమినియం సైడ్స్, ముఖ్యంగా కుడి బోర్డర్‌లో హానర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రత్యేక డిజైన్ ఫోనుకు అదనపు అందాన్ని ఇస్తుంది. ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్‌ గల Samsung M20 చాలా మంది వినియోగదారులకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దీని ఇన్ఫినిటీ-వి డిస్ప్లే కూడా దృష్టిని ఆకర్షిస్తుంది అయితే బార్డర్ లేని HONOR 8X డిజైన్ కూడా ఏమాత్రం తీసిపోదు. కాబట్టి దృఢమైన, మంచి డిస్ప్లే, M20 కంటే ఆధునిక టెక్నాలజీ ఉండడంతో ఇది మరింత సూచించదగినది.

  డిస్ప్లే:
  స్క్రీన్ విభాగంలో HONOR 8X 8X 16.51 సెం.మీ (6.5-అంగుళాల) పూర్తి హెచ్‌డీ+రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్ కాగా, Samsung M20 కేవలం 16 సెం.మీ (6.3-అంగుళాల) పూర్తి హెచ్‌డీ+ 1080 x 2340 పిక్సెల్స్ డిస్ప్లే. అందువలన గేమ్స్ ఆడడానికి, వీడియోలు చూడడానికి , HONOR 8X తగిన స్మార్ట్‌ఫోన్‌. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌లు కలవు, కానీ , HONOR 8X లో వేగవంతమైన పేస్ అన్‌లాక్ సిస్టమ్ ఉండడంతో ఇది అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

  పనితీరు:
  రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 8.1 (ఓరియో) ఓఎస్‌ కలదు, ఇది ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 9 (పై) కు అప్‌గ్రేడ్. , HONOR 8X లో ఆక్టా-కోర్ 2.2 గిగా హెడ్జ్ 12 ఎన్ఎమ్ కార్టెక్స్ ఎ 73 జనరేషన్‌తో కూడిన ఎస్ఓసీతో పాటు హై సిలికాన్ కిరిన్ 710 ఎస్ఓసీ చిప్‌సెట్ కలదు, దీనితో పాటు 4 జిబి / 6 జిబి ర్యామ్, 64 జిబి / 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ కూడా కలదు. అయితే Samsung M20 లో 1.8 గిగా హెడ్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 7904 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, దీనిలో 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ వస్తుంది.

  HONOR 8X లో అదనంగా జీపీయూ టర్బో 3.0 కలదు, ఇది మీకు మంచి పనితీరు, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం, మంచి బ్యాటరీ నిర్వహణను అందిస్తుంది. మేము పబ్జీ, ఫిఫా మొబైల్, అస్ఫాల్ట్ 9 గేమ్స్‌ను రెండింటిలో ఆడి చూసాము, అందుకని గేమ్స్ ఆడేవారికి హానర్ 8ఎక్స్ అనేది మంచి ఎంపిక అని చెప్పగలము. ఇక పనితీరు విషయానికి వస్తే Samsung M20 కంటే HONOR 8X మెరుగైనది.

  కెమెరా:
  హువాయి స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలోని ఉత్తమ కెమెరాలలో HONOR 8X ఒకటి. వీటికి గల డ్యుయల్ రేర్ 20 ఎంపీ / 2 ఎంపీ కెమెరాలు ఏఐ మోడ్, వైడ్ అపార్చర్ మోడ్ తో ఖచ్చితమైన నైట్ షాట్‌ను అందిస్తాయి. ఈ కెమెరా 4కె షూటింగ్ అందుబాటులో లేనప్పటికీ అందమైన ఫోటోలు, వీడియోలు తీయడంలో సహాయపడుతుంది. హానర్ సెల్ఫీ కెమెరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ఇది మరింత అద్భుతంగా పనిచేస్తుంది. HONOR 8X లో గల 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆటో ఫోకస్, అతిచిన్న వాటిని కూడా క్యాప్చర్ చేయగలిగేలా అప్‌గ్రేడ్ చేయబడినది. ఈ ఫోన్ చౌకగా లభించినప్పట్టికీ, అద్భుతమైన కెమెరా స్పెసిఫికేషన్లు కలిగి ఉంటుంది.

  HONOR 8X కెమెరా ఫీచర్లతో పోల్చి చూస్తే, Samsung M20 లో మెరుగైన దానిలా అనిపించదు. దీనిలో డ్యుయల్ లెన్స్ రేర్ కెమెరా, ఎఫ్/1.9 అపార్చర్ తో కూడిన 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.2 అపార్చర్ తో కూడిన 5 ఎంపీ సెకండరీ సెన్సార్ కలవు. దీనిలో 120-డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా కలవు. దీనిలోని 8ఎం సెల్ఫీ కెమెరా అన్నింటినీ క్యాప్చర్ చేయలేదు దానితో మీరు కొన్నింటిని కోల్పోతారు. మీరు కెమెరా కోసం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారైతే HONOR 8X ని ఎంచుకోవడం మంచిది.

  బ్యాటరీ:
  HONOR 8X లో 3,750 ఎంఏహెచ్ బ్యాటరీ, Samsung M20లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలవు. ఆశ్చర్యకరంగా 4,000 ఎంఏహెచ్ తో పోల్చి చుస్తే HONOR 8X సమానంగా పనిచేస్తుంది. HONOR లోని కస్టమ్ ఓఎస్ ఈఎంయూఐ 9.1, జీపీయు 3.0 కారణంగా మంచి బ్యాటరీ నిర్వహణను అందించగలదని చెప్పవచ్చు. మీరు అంకెల ద్వారా వెళ్ళాలనుకుంటే Samsung M20 గెలుస్తుంది, కానీ పనితీరు పరంగా మేము రెండూ సమానమేనని గ్రహించాము.

  ధరలు:
  పండుగ అమ్మకాల సమయంలో HONOR 8X  4 + 64జీబీ వేరియంట్ రూ. 9,999కు, 6+64జీబీ రూ. 11,999కు, Samsung M20 4జీబీ వేరియంట్ రూ.9,990లకు లభిస్తున్నాయి.

  అంతిమ తీర్పు:
  ప్రస్తుతం Samsung M20, HONOR 8X 4జీబీ వేరియంట్ ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, Samsung M20  ఉత్తమ ప్యాకెజ్‌లు లేవు. కానీ HONOR 8X ఉత్తమ కెమెరా క్వాలిటీ, పనితీరుని అందిస్తుంది. HONOR 8X ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా, ధరకు తగినట్లు మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇది వదులుకోరాని మంచి ఫీచర్లతో కూడిన అందమైన ఫోన్. HONOR 8X కచ్చితంగా మీకు మంచి అనుభవాన్ని అందిస్తుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Gadget, Honor, Mobiles, Samsung, Technology

  తదుపరి వార్తలు