Samsung Mobiles: సాంసంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్లు.. పూర్తి వివరాలివే..

Samsung Mobiles: సాంసంగ్ సంస్థ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం. గెలాక్సీ A02, గెలాక్సీ M02 పేర్లతో ఫోన్లను ఆ సంస్థ రూపొందిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఆ సంస్థ విడుదల చేయలేదు.

news18-telugu
Updated: October 20, 2020, 12:58 PM IST
Samsung Mobiles: సాంసంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్లు.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాంసంగ్ సంస్థ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం. గెలాక్సీ A02, గెలాక్సీ M02 పేర్లతో ఫోన్లను ఆ సంస్థ రూపొందిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఆ సంస్థ విడుదల చేయలేదు. ఈ నెల ప్రారంభంలో శామ్‌సంగ్ నుంచి SM-A025F, SM-M025F మోడల్ నంబర్లు నార్వేజియన్ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఫోన్‌ల సిరీస్ నంబర్లు, వాటి మోడల్ నంబర్లు ఒకేలా ఉండటంతో సాంసంగ్ ఈ సరికొత్త బడ్డెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఈ మోడల్ నంబర్లు, నమూనాలు బ్లూటూత్ SIG సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కూడా కనిపించాయి. దీంతో సాంసంగ్ నుంచి ఈ రెండు ఫోన్లు త్వరలోనే రానున్నాయనే వాదన నిజమేనని తెలుస్తోంది.

వెల్లడి కాని వివరాలు..

గత Nemko సర్టిఫికేషన్‌ కూడా ఈ బడ్డెట్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. కానీ బ్లూటూత్ సర్టిఫికేషన్‌ ద్వారా ఈ రెండు ఫోన్లు వి4 బ్లూటూత్ సపోర్ట్‌తో రానున్నాయని తెలుస్తోంది. ఈ రెండు బడ్జెట్ ఫోన్లు ఒకే సీరీస్ లో, ఒకే రకమైన ఫీచర్లతో రానున్న మోడల్స్ అని తెలుస్తోంది. SM-A025F మోడల్ నంబర్‌తో రానున్న Galaxy A02 ఫోన్‌ 2జీబీ ర్యామ్‌తో పనిచేయనుందని ఒక గ్రీక్‌ బెంచ్‌ వెబ్సైట్ గత నెలలో తెలిపింది. ఆక్టా కోర్ క్వాల్‌కోమ్  SoC, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ తో, ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్‌ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుందని ఆ వెబ్‌సైట్‌ వివరాలు వెల్లడించింది. ఇది సింగిల్ కోర్ బెంచ్‌మార్కింగ్‌లో 751 స్కోర్‌, 3,824 మల్టీ కోర్‌ స్కోర్‌తో లభిస్తుందని గ్రీక్‌బెంచ్ వెబ్ సైట్ పేర్కొంది.

గతంలో సాంసంగ్ గెలాక్సీ ఎమ్01, ఏ01 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ప్రస్తుతం గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్‌ 5.71 అంగుళాల HD డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439, డ్యుయల్ రియర్ కెమెరాలు (13 మెగాపిక్సెల్+ 2 మెగాపిక్సెల్) వంటి ఫీచర్లతో లభిస్తుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ01 ఫోన్ కూడా దాదాపు ఇవే ఫీచర్లతో లభిస్తుంది. కానీ దీని బ్యాటరీ సామర్థ్యం 3,000 ఎంఏహెచ్ వరకే ఉంటుంది.
Published by: Nikhil Kumar S
First published: October 20, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading