Samsung Galaxy Note 20: విశ్వసనీయ సమాచారం మేరకు శ్యామ్‌సంగ్ గాలెక్సీ నోట్ 20, గాలెక్సీ ఫోల్డ్ 2 మోడల్స్‌ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్యామ్‌సంగ్ గాలెక్సీ నోట్ 20 ఊహించిన దానికంటే ముందే మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఆగస్టు 5న దీన్ని మార్కెట్లోకి విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్యామ్‌సంగ్ వర్గాల సమాచారం. అదే రోజున శ్యామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20తో పాటు గెలాక్సీ ఫోల్డ్ 2, గెలాక్సీ వాచ్ 2ను కూడా ఆన్లైన్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్యామ్‌సంగ్ ఎలాంటి ఫోన్‌నూ ఆన్లైన్ ఈవెంట్లో విడుదల చేయలేదు. కోవిడ్-19 ప్రభావం కారణంగా తొలిసారిగా ఈ కొత్త మోడల్స్‌ను ఆన్లైన్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనుంది దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శ్యామ్‌సంగ్. అప్పటికల్లా కోవిడ్-19 అదుపులోకి వస్తే ఈ విషయంలో ఆ సంస్థ మార్పులు చేసుకునే అవకాశముంది.
ఆగస్టు 5న మార్కెట్లోకి విడుదలయ్యే మోడల్స్‌లో నోట్ 20 అల్ట్రా, గాలక్సీ z ఫ్లిప్ 5జీ, గాలక్సీ ట్యాప్ S7, గాలెక్సీ ట్యాప్ S7+ తదితరాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే గాలెక్సీ నోట్ 20, గెలాక్సీ ఫోల్డ్ 2 విడుదలకు సంబంధించి శ్యామ్‌సంగ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.