మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే గుడ్ న్యూస్. సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయి. ది ఫ్రేమ్ 2020 పేరుతో లైఫ్‌స్టైల్ టీవీతో పాటు 10 కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్‌ని పరిచయం చేసింది సాంసంగ్. ఈ స్మార్ట్ టీవీల ప్రారంభ ధర రూ.14,490. జూన్ 19 అర్థరాత్రి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి 48 గంటల్లో ప్రీపెయిడ్ ద్వారా ది ఫ్రేమ్, స్మార్ట్ టీవీలను క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.1,500 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది సాంసంగ్. అమెజాన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ప్రీపెయిడ్ ద్వారా కొంటే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సాంసంగ్ కొత్తగా రిలీజ్ చేసిన టీవీల ధరలు ఈ విధంగా ఉన్నాయి.
హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ (32 అంగుళాలు)- రూ.14,490
ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ (43 అంగుళాలు)- రూ.31,990
4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ (43 అంగుళాలు)- రూ.36,990
4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ (65 అంగుళాలు)- రూ.89,990
ది ఫ్రేమ్ 2020 టీవీ (50 అంగుళాలు)- రూ.74,990
ది ఫ్రేమ్ 2020 టీవీ (55 అంగుళాలు)- రూ.84,990
ది ఫ్రేమ్ 2020 టీవీ (65 అంగుళాలు)- రూ.1,39,990
యువతను, ఆన్‌లైన్ కంటెంట్ ఎక్కువగా చూసేవారిని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ స్మార్ట్ టీవీలను తయారు చేసినట్టు సాంసంగ్ ప్రకటించింది. స్మార్ట్ టీవీల్లో ఆటో హాట్‌స్పాట్ టెక్నాలజీ, యూఎస్‌బీ 3.0, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, సాంసంగ్ బిక్స్‌బై లాంటి వాయిస్ అసిస్టెంట్స్ ఉంటాయి. వీటితో పాటు గేమ్ ఎన్‌హాన్సర్, కంటెంట్ గైడ్, పర్సనల్ కంప్యూటర్ మోడ్, హోమ్ క్లౌడ్, మ్యూజిక్ ప్లేయర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పర్సనల్ కంప్యూటర్ మోడ్‌తో టీవీని కంప్యూటర్‌గా మార్చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
Mi Power Bank 3: షావోమీ మరో సంచలనం... రూ.2,000 లోపే 30,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
Tecno spark power 2: పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ... రూ.9,999 ధరకే అదిరిపోయే ఫీచర్స్
Flipkart: మీ స్మార్ట్‌ఫోన్ పాడైందా? రూ.99 చెల్లిస్తే ఇంటి దగ్గరే రిపేర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, Flipkart, Samsung, Smart TV