Home /News /technology /

SAMSUNG LAUNCHES GALAXY A22 5G AND GALAXY A22 4G SMARTPHONES KNOW SPECIFICATIONS SS

Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ రిలీజ్

Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ రిలీజ్

Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ రిలీజ్

Samsung Galaxy A22 | సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    సాంసంగ్ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ మోడల్స్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఒకేలా ఉంటాయి. 5జీ మోడల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా, పెద్ద డిస్‌ప్లే ఉంటే, 4జీ మోడల్‌లో మాత్రం క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు నెదర్లాండ్స్‌లో రిలీజ్ అయ్యాయి. మరి ఇండియాలో ఈ ఫోన్లు రిలీజ్ అవుతాయో లేదో సాంసంగ్ వెల్లడించలేదు. మార్కెట్లోకి 5జీ మోడల్స్ వరుసగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగని 4జీ మోడల్స్‌కు డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు సాంసంగ్ ఒకేసారి రెండు మోడల్స్‌ని లాంఛ్ చేసింది.

    Realme Anniversary Sale: రియల్‌మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

    Realme X7 Max 5G: కాసేపట్లో రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ సేల్... ఆఫర్ వివరాలు ఇవే

    సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ 8 5జీ, పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రానుంది. 4జీబీ+64జీబీ ధర సుమారు రూ.20,300 కాగా, 4జీబీ+128జీబీ ధర సుమారు రూ.22,100. మిగతా వేరియంట్ల ధరలు తెలియాల్సి ఉంది. గ్రే, మింట్ వయొలెట్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

    WhatsApp: వాట్సప్ నుంచి మూడు కొత్త ఫీచర్స్... ప్రకటించిన జుకర్‌బర్గ్

    WhatsApp: వాట్సప్‌లో సమస్యలున్నాయా? ఈయనకు కంప్లైంట్ చేయండి

    ఇక సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ టెక్నో స్పార్క్ 7 ప్రో, పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉండగా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. బ్లాక్, మింట్, వయొలెట్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు