ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- AI మనుషుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు పరిశోధకులు. ప్రముఖ కంపెనీలు వాషింగ్ మెషిన్లకు కూడా AI సాంకేతికతను జోడిస్తున్నాయి. తాజాగా హిందీ, ఇంగ్లిష్ భాషలతో పనిచేసే AI వాషింగ్ మెషిన్లను అభివృద్ధి చేసింది సాంసంగ్ సంస్థ. ఈ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లను భారత వినియోగదారుల కోసమే రూపొందించామని సాంసంగ్ తెలిపింది. సంస్థకు చెందిన ఎకోబబుల్, క్విక్ డ్రైవ్ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. ఇవి 45 శాతం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కేర్‌ను అందిస్తాయి. దీంతోపాటు సమయం, విద్యుత్‌ను కూడా ఆదా చేస్తాయని కంపెనీ పేర్కొంది.
సాంసంగ్ మొత్తం 21 వాషింగ్ మెషిన్లను విడుదల చేసింది. ఇవన్నీ AI ఫీచర్లను కలిగి ఉంటాయి. వినియోగదారుల లాండ్రీ అలవాట్లను ఇవి నేర్చుకొని, గుర్తుంచుకుంటాయి. ఎప్పుడూ వాడే వాష్ సైకిల్‌ను కస్టమర్లను సూచిస్తాయి. మిషిన్‌లో ఉండే లాండ్రీ ప్లానర్.. దుస్తుల రకాలు, రంగు ఆధారంగా ఎంతసేపు వాటిని ఉతకాలో సూచిస్తుంది. వీటిని సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలకు, అలెక్సా, గూగుల్ వంటి ఇతర వాయిస్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
The laundry revolution is here. Presenting the Samsung AI Ecobubble™ Washing Machine for best fabric protection and gentlest of washes. pic.twitter.com/jkzGnUpAGQ
కరోనా తరువాత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్మార్ట్ టెక్నాలజీని కంపెనీలు ఉపయోగిస్తున్నాయని సాంసంగ్ సంస్థ ప్రతినిధి రాజు పుల్లాన్ తెలిపారు. తమ సంస్థ అభివృద్ధి చేసిన AI ఆధారిత వాషింగ్ మెషిన్ లైనప్ హిందీ, ఇంగ్లిష్ యూజర్ ఇంటర్ఫేస్తో పనిచేస్తుందన్నారు. దేశీయ మార్కెట్ అవసరాలకు ఇలాంటి సాంకేతికతో వాషింగ్ మిషిన్లను అభివృద్ధి చేయడం గొప్ప విషయమని చెప్పారు. ఇవి 2,000కు పైగా వాష్ కాంబినేషన్లు, విభిన్న రకాల ఫ్యాబ్రిక్ల కోసం 2.8 మిలియన్ల డేటా ఎనాలిసిస్ పాయింట్లతో లభిస్తున్నాయని వివరించారు. ఈ మోడళ్లతో పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సెగ్మెంట్లో మెరుగైన మార్కెట్ వాటా దక్కించుకుంటామని వెల్లడించారు.
ఎక్కడ లభిస్తాయి?
ఈ సరికొత్త AI వాషింగ్ మెషిన్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి దేశంలోని అన్ని రిటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.35,400 నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని మోడళ్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, సాంసంగ్ ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. EMI, నో కాస్ట్ EMI ఆప్షన్లతో కొనుగోలు చేసే వారికి సాంసంగ్ ఆఫర్లకు కూడా అందిస్తోంది.