Home /News /technology /

SAMSUNG LAUNCHES 5 NEW SMARTPHONES SIMULTANEOUSLY FROM GALAXY A SERIES PRICE AND FEATURES ARE DETAILED HERE GH VB

Samsung: శామ్​సంగ్ గెలాక్సీ A సిరీస్ నుంచి ఒకేసారి 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శామ్​సంగ్​ వరుస స్మార్ట్​ఫోన్ల లాంచింగ్​తో భారత్​లో విస్తరిస్తోంది. శామ్​సంగ్​ ప్రస్తుతం భారత్​లో విక్రయిస్తున్న గెలాక్సీ ఎ సిరీస్ పోర్ట్‌ఫోలియోకు ఐదు కొత్త మోడల్స్​ను జోడించింది.

దక్షిణ కొరియా(South Korea) మొబైల్ దిగ్గజం శామ్​సంగ్​(Samsung) వరుస స్మార్ట్​ఫోన్ల లాంచింగ్​తో(Launching) భారత్​లో విస్తరిస్తోంది. శామ్​సంగ్​ ప్రస్తుతం భారత్​లో విక్రయిస్తున్న గెలాక్సీ ఎ సిరీస్(Galaxy A Series) పోర్ట్‌ఫోలియోకు ఐదు కొత్త మోడల్స్(5 New Models)​ను జోడించింది. గెలాక్సీ A53 5G, గెలాక్సీ A33 5G, గెలాక్సీ A23, గెలాక్సీ A13 ఫోన్లను జోడించినట్లు శాంసంగ్ మంగళవారం ప్రకటించింది. కొత్త గెలాక్సీ A53 5G, గెలాక్సీ A33 5G, గెలాక్సీ A23, గెలాక్సీ A13 నాలుగు ఫోన్లు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో(Color Options) లభిస్తాయి. పీచ్​, నీలం, నలుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంటాయి.

శామ్​సంగ్​ గెలాక్సీ A సిరీస్ ధర
గెలాక్సీ A53 5G 6GB+128GB ధర రూ. 34,499 వద్ద, 8GB+128GB వేరియంట్ ధర రూ. 35,999 వద్ద ప్రారంభమవుతాయి. ఇక, గెలాక్సీ A23 6GB+128GB ధర రూ.19,499 వద్ద, 8GB+128GB వేరియంట్‌ ధర రూ.20,999 వద్ద లభిస్తాయి. అదే సమయంలో, గెలాక్సీ A13 4GB+64GB ధర రూ.14,999 వద్ద, 4GB+128GB వేరియంట్​ ధర రూ.15,999 వద్ద, 6GB+64GB ధర రూ.17,499 వద్ద అందుబాటులో ఉంటాయి.

శామ్​సంగ్​ గెలాక్సీ A సిరీస్​ ఫీచర్లు
గెలాక్సీ A73 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 108MP కెమెరాతో వస్తుంది. IP67 రేటింగ్‌తో కూడిన వాటర్​, డస్ట్​ రెసిస్టన్స్ సూపర్ AMOLED+​ డిస్​ప్లేను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన స్నాప్​డ్రాగన్ 778G 5G ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఇది మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది.- 8GB ర్యామ్​ + 128GB స్టోరేజ్​, 8GB ర్యామ్​ + 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్​ను ​1TB వరకు విస్తరించుకోవచ్చు.

ఇక, గెలాక్సీ A53 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది64MP OIS కెమెరాతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 -అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని డిస్​ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​తో వస్తుంది. గెలాక్సీ A53 5G ఎక్సినోస్​1280 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. గెలాక్సీ A33 5G స్పోర్ట్స్ క్వాడ్ వెనుక కెమెరాతో వస్తుంది. దీనిలో 48MP మెయిన్​ లెన్స్‌ కెమెరాను అందించింది. ఇది శక్తివంతమైన ఎక్సినోస్​ 1280 ప్రాసెసర్​పై పనిచేస్తుంది. 6.4 -అంగుళాల సరౌండ్ సౌండ్ ఎక్స్​పీరియన్స్​ ఇస్తుంది. ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది.

Xiaomi Mi Pad 5: షియోమి నుంచి త్వరలోనే ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్​ లాంచ్​.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు..


గెలాక్సీ A23 ఫీచర్ల విషయానికి వస్తే.. మృదువైన స్క్రోలింగ్ కోసం 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 -అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా హై క్వాలిటీ ఫోటోలను తీయగలదు. షార్ప్, బ్లర్-ఫ్రీ ఫోటోల కోసం 50MP మెయిన్ లెన్స్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 4G ప్రాసెసర్​పై పనిచేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5000mAh బ్యాటరీతో వస్తుంది.

గెలాక్సీ A13 మెరుగైన వీక్షణ అనుభవం కోసం 6.6 -అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాతో పాటు 50MP క్వాడ్ కెమెరాలతో వస్తుంది. ఇది ఎక్సినోస్​ 850 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g smart phone, Samsung Galaxy, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు