స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రెండు కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేసింది సాంసంగ్. గెలాక్సీ ఏ సిరీస్‌లో గెలాక్సీ ఏ50ఎస్, గెలాక్సీ ఏ30ఎస్ మోడల్స్‌ని పరిచయం చేసింది. కొద్ది రోజుల క్రితమే గెలాక్సీ ఏ50, గెలాక్సీ సాంసంగ్ ఏ30 రిలీజ్ చేసింది సాంసంగ్. ఇప్పుడు వాటికి అప్‌గ్రేడ్ వర్షన్స్ అయిన గెలాక్సీ ఏ50ఎస్, గెలాక్సీ ఏ30ఎస్ మోడల్స్‌ని సరికొత్త ఫీచర్స్‌తో తీసుకొచ్చింది. ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, సాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌లో వీటిని కొనొచ్చు. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లకు డబుల్ డేటా లభిస్తుంది. రోజుకు 0.5 జీబీ చొప్పున 18 నెలల పాటు అదనంగా డేటా లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యూజర్లకు రూ.255 రీఛార్జ్‌పై రూ.75 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ | సాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్ | |
డిస్‌ప్లే | 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే | 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-వీ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే |
ర్యామ్ | 4 జీబీ, 6 జీబీ | 4 జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 128 జీబీ | 64 జీబీ |
ప్రాసెసర్ | ఎక్సినోస్ 9611 | ఎక్సినోస్ 7904 |
రియర్ కెమెరా | 48+8+5 మెగాపిక్సెల్ | 25+8+5 మెగాపిక్సెల్ |
ఫ్రంట్ కెమెరా | 32 మెగాపిక్సెల్ | 16 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 4,000 ఎంఏహెచ్ | 4,000 ఎంఏహెచ్ |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 9 పై | ఆండ్రాయిడ్ 9 పై |
కలర్స్ | ప్రిస్మ్ క్రష్ వయొలెట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ వైట్ | ప్రిస్మ్ క్రష్ వయొలెట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ వైట్ |
ధర | 4 జీబీ + 128 జీబీ- రూ.22,9996 జీబీ + 128 జీబీ- రూ.24,999 | 4 జీబీ + 64 జీబీ- రూ.16,999 |
Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?
ఇవి కూడా చదవండి:
Flipkart Sale: సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్లు తెలుసుకోండి
Camera Tips: ఫోటోలు బాగా రావాలా? స్మార్ట్‌ఫోన్ కెమెరా ఎంత ఉండాలో తెలుసుకోండి
IRCTC: రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయండి ఇలా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Samsung, Smartphone