ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4,400mHA. ప్రైమరీ కెమరా 12 ఎంపీ ఉండగా ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమరా 12 ఎంపీ ఉంటుంది. సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ కెమరాను ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 271గ్రాములు ఉంది. స్టోరే సామర్థ్యం 12 జీబీ RAMతో 256, 512 జీబీ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 12జీబీ RAM/256 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.1,49,999 ఉంది. 12 జీబీRAM/512 జీబీ రూ.1,57,999కు లభిస్తోంది.
శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రెండు మోడల్‌లలో లభ్యం కానుంది. ఇందులో 8జీబీ RAM/ 128జీబీ స్టోరేజ్ మోడల్ ఒకటి.. 8 జీబీ RAM/256జీబీ స్టోరేజ్‌తో మరో మోడల్ అందుబాటులో ఉంది. 8జీబీRAM/128జీబీ స్టోరీజ్(Storage) మోడల్ ధర రూ.84,999, 8 జీబీ RAM/256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.88,999కు లభిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో సైజ్ 6.7 అంగుళాలు ఉంది. ఎఫ్ హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే, 425పీపీఐ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11(Android 11), శామ్సంగ్ వన్ యుఐ 3.1 సాఫ్ట్ వేర్ ఫోన్ పని చేయనుంది. మెయిన్ కెమెరా 12 ఎంపీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 12 ఎంపీ ఉంది. బ్యాటరీ(Battery) సామర్థ్యం 3,300 ఎమ్ఎహెచ్ కాగా సెల్ఫీ కెమెరా 10 మెగా పిక్సల్ ఉంది.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు వాటితో కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. భారతదేశంలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 09, 2021 వరకు ఈ మోడల్‌లు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లు సెప్టెంబర్ 10, 2021 నుంచి అమ్మకానికి రానున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.