పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? వీకెండ్లో సినిమాలు చూసేందుకు ఓ మంచి ట్యాబ్ కావాలా? సాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో రెండు ట్యాబ్లెట్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ, గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ మోడల్స్‌ని ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది కంపెనీ. గతేడాది ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ ప్రారంభ ధర రూ.11,999 మాత్రమే. ఇది వైఫై మోడల్ ధర. ఎల్టీఈ మోడల్ ధర రూ.14,999. ఇక సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ ప్రారంభ ధర రూ.46,999. ఇది 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర రూ.50,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొనేవారికి రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కీబోర్డ్ కవర్‌పై రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. జూన్ 23 నుంచి సాంసంగ్ వెబ్సైట్, సాంసంగ్ ఎక్స్‌క్లూజీవ్ స్టోర్స్, ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 8.7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5,100ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. గ్రే, సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఎస్ పెన్ సపోర్ట్ చేస్తుంది.
ఇక సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 12.4 అంగుళాల డిస్ప్లే ఉంది. ఎస్ పెన్ కూడా బాక్సులో వస్తుంది. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది. 10,090ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్ కలర్స్‌లో లభిస్తుంది. డాల్బీ అట్మాస్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ సౌండ్ బై ఏకేజీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.