• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SAMSUNG LAUNCHED GALAXY F41 SMARTPHONE WITH 64 MEGAPIXEL TRIPLE REAR CAMERA AND 32 MEGAPIXEL SELFIE GET INTRODUCTORY DISCOUNT OF RS 1500 SS

Samsung Galaxy F41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజ్... మొదటి సేల్‌లో కొంటే రూ.1,500 డిస్కౌంట్

Samsung Galaxy F41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజ్... మొదటి సేల్‌లో కొంటే రూ.1,500 డిస్కౌంట్

Samsung Galaxy F41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజ్... మొదటి సేల్‌లో కొంటే రూ.1,500 డిస్కౌంట్ (image: Samsung India)

Samsung Galaxy F41 | మీకు ఫోటోగ్రఫీ ఇష్టమా? మంచి కెమెరాలు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజైంది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
    సాంసంగ్ నుంచి కొత్త సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇప్పటికే ఏ, ఎం, ఎస్, జెడ్ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన సాంసంగ్... ఇప్పుడు ఎఫ్ సిరీస్‌లో ఫస్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 గ్రాండ్‌గా రిలీజైంది. వాటర్ డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే నాచ్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా కెమెరాలను దృష్టిలో పెట్టుకొని ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ సరికొత్త సిరీస్‌ను పరిచయం చేసింది సాంసంగ్. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.16,999. కానీ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,500 డిస్కౌంట్ ప్రకటించింది సాంసంగ్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.15,499 ధరకే 6జీబీ+64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఎస్‌బీఐ కార్డుతో మరో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లో ఈ ఫోన్‌ను రూ.10,850 ధరకే కొనొచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు. ఏడాది వాడిన తర్వాత ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. ఎక్స్‌ఛేంజ్ చేయకుండా ఫోన్ వాడుకోవాలనుకుంటే మిగతా 30 శాతం చెల్లించాలి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా అక్టోబర్ 16న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 సేల్ మొదలవుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 కొనొచ్చు.


    సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్+5 మెగాపిక్సెల్ టెర్టియర్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + వన్ యూఐ
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ, ప్యూజన్ బ్లాక్
    ధర:
    6జీబీ+64జీబీ- రూ.16,999 (ఇంట్రడక్టరీ ఆఫర్‌లో రూ.15,499)
    6జీబీ+128జీబీ- రూ.17,999 (ఇంట్రడక్టరీ ఆఫర్‌లో రూ.16,499)
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు