Home /News /technology /

SAMSUNG LAUNCHED 5G SMARTPHONE SAMSUNG GALAXY A90 5G IN KOREA KNOW THE PRICE AND SPECIFICATIONS SS

5G Smartphone: 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర ఎంతో తెలుసా?

5G Smartphone: 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర ఎంతో తెలుసా?
(Image: Samsung)

5G Smartphone: 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర ఎంతో తెలుసా? (Image: Samsung)

Samsung Galaxy A90 5G | స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ కెమెరాలో సూపర్ స్టెడీ, సీన్ ఆప్టిమైజర్, ఫ్లా డిటెక్టర్, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    ఇప్పుడు అంతా 4జీ స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. ప్రపంచం 5జీ నెట్‌వర్క్‌కు సిద్ధమవుతోంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా 5జీ మొబైల్స్ తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సాంసంగ్ మాత్రం 5జీ సపోర్టెడ్ ఫోన్లు రిలీజ్ చేస్తోంది. గతంలో గెలాక్సీ నోట్ 10 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసింది సాంసంగ్. ఇప్పుడు కొరియాలో 5జీ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఏ90 ఆవిష్కరించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఏ-సిరీస్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. సెప్టెంబర్ 4న సౌత్ కొరియాలో సాంసంగ్ గెలాక్సీ ఏ90 సేల్ మొదలవనుంది. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ కెమెరాలో సూపర్ స్టెడీ, సీన్ ఆప్టిమైజర్, ఫ్లా డిటెక్టర్, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    సాంసంగ్ గెలాక్సీ ఏ90 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
    ర్యామ్: 6 జీబీ, 8 జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
    రియర్ కెమెరా: 48+5+8 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + సాంసంగ్ వన్ యూఐ
    కలర్స్: బ్లాక్, వైట్
    ధర: సుమారు రూ.53,000

    Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Android 10: ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది... ఆకట్టుకునే ఫీచర్స్ ఇవే

    Vodafone Offer: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.20 రీఛార్జ్ చేస్తే చాలు

    Discount: ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,000 డిస్కౌంట్
    First published:

    Tags: 5G, Android, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు