హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

TV Offer: శాంసంగ్ కొత్త టీవీలు.. కొనాలనుకునే వారికి రూ.1,499 ఈఎంఐ ఆఫర్!

TV Offer: శాంసంగ్ కొత్త టీవీలు.. కొనాలనుకునే వారికి రూ.1,499 ఈఎంఐ ఆఫర్!

Samsung Offer |కొత్తగా టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా బ్రాండెడ్ స్మార్ట్ టీవీ అయితే బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. శాంసంగ్ కొత్త టీవీలపై ఆకర్షణీయ ఆఫర్ పొందొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Samsung Smart TV | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ (Samsung) కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 32 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో ఈ టీవీలు (Smart TV) మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతో కంపెనీ దేశంలో తన స్మార్ట్ టీవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరింపజేసుకుంది. ఈ స్మార్ట్ టీవీల్లో చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. త్రి సైడ్ బెజిల్ లెస్ డిస్‌ప్లే వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

  ఈ ఫీచర్ వల్ల శాంసంగ్ కొత్త టీవీలు ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకున్నాయి. కంపెనీ ఈ టీవీ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. నెలకు ఈఎంఐ రూ. 1499 నుంచి ప్రారంభం అవుతోంది. కంపెనీ వెబ్‌సైట్ నుంచి మాత్రమే కాకుండా దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా ఈ కొత్త టీవీలను కొనుగోలు చేయొచ్చు.

  బిగ్ డిస్కౌంట్.. రూ.25,000 స్మార్ట్‌టీవీని రూ.8 వేలకే కొనండి

  టీవీ ఫీచర్ల విషయానికి వస్తే.. వీటిల్లో హై డైనమిక్ రేంజ్, ప్యూర్‌కలర్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అల్ట్రా క్లీన్ వ్యూ, కాంట్రాస్ట్ ఎన్‌హ్యాన్సర్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. 3డీ సరౌండ్ సౌండ్ ఫీచర్ ఉంది. డాల్బే డిజిటల్ ప్లస్ ప్రత్యేకత కూడా ఉంది. స్టన్నింగ్ ఆడియో ఫీచర్ల వల్ల సినిమా హాల్‌లో ఉన్నట్లు ఫీల్ కలుగుతుంది. ఇంకా ఈ టీవీలో చాలా స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

  టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీలపై భారీ తగ్గింపు.. రూ.3,300కే కొనొచ్చు

  శాంసంగ్ కంపెనీ ఈ టీవీల్లో యూనివర్సల్ గైడ్ ఫీచర్‌ను పొందుపరిచింది. ఈ ఫీచర్ వల్ల కస్టమర్లు వివిధ స్ట్రీమింగ్ యాప్స్ నుంచి నచ్చిన ఫేవరేట్ కాంటెంట్‌ను ఎంచుకోవచ్చు. ఇంకా శాంసంగ్ టీవీ ప్లస్ ఉంది. దీని ద్వారా 55 గ్లోబల్, లోకల్ లైవ్ ఛానల్స్ చూడొచ్చు. దీని కోసం యూజర్లు వారి శాంసంగ్ టీవీ ప్లస్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

  ఇంకా ఈ టీవీల్లో పీసీ, గేమ్ మోడ్ ఫీచర్ ఉంది. పీసీ మోడ్ ఆప్షన్ ఎంచుకుంటే టీవీని పర్సనల్ కంప్యూటర్‌గా వాడుకోవచ్చు. అలాగే గేమ్ మోడ్ ఎంచుకుంటే.. టీవీ ద్వారా బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. బెస్ట్ ఫ్రేమ్ రేటు లభిస్తుంది. ఇంకా ఈ టీవీల్లో స్క్రీన్ మిర్రరింగ్, వెబ్‌ బ్రౌజింగ్ ఫీచర్ వంటివి కూడా ఉన్నాయి. దీంతో కొత్తగా బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈఎంఐ రూపంలో టీవీని కొనుగోలు చేయొచ్చు. కాగా ఈ ఈఎంఐ పరిమిత కాలం వరకే ఉండొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Budget smart tv, Flipkart, Samsung, Smart TV

  ఉత్తమ కథలు