Home /News /technology /

SAMSUNG LAUNCH OF GALAXY S20 FE 2022 MODEL SMARTPHONE FEATURES PRICE DETAILS HERE GH VB

SAMSUNG: గెలాక్సీ S20 FE 2022 మోడల్‌ లాంచ్.. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ Galaxy S20 FE మోడల్‌ను 2020లో మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా Galaxy S20 FE 2022 పేరుతో సరికొత్త మోడల్‌ను దక్షిణ కొరియాలో చడిచప్పుడు లేకుండా లాంచ్ చేసింది.

టెక్నాలజీలో (Technology) మార్పుల కారణంగా మొబైల్ కంపెనీలు(Mobile Companies) సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను(Smart Phones) మార్కెట్‌లో విడుదల చేస్తుంటాయి. దిగ్గజ ఎలక్ట్రానిక్స్(Electronics) కంపెనీ శామ్‌సంగ్ Galaxy S20 FE మోడల్‌ను 2020లో మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా Galaxy S20 FE 2022 పేరుతో సరికొత్త మోడల్‌ను దక్షిణ కొరియాలో చడిచప్పుడు లేకుండా లాంచ్ చేసింది. ఇది 2020లో ప్రారంభించిన Galaxy S20 FEని పోలి ఉంటుంది. ధర కూడా గత మోడల్ కంటే తక్కువగా ఉండనుంది. Samsung Galaxy S20 FE 2022 న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్.. 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. సెల్ వెనుక భాగంలో మూడు కెమెరాలు, బ్యాటరీ సామర్థ్యం 4,500mAhతో రూపొందించారు. ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్‌లో ఎప్పుడు విడుదల చేయనున్నారో శామ్‌సంగ్ ప్రకటించలేదు.

శాంసంగ్ గెలాక్సీ S20 FE 2022 ధరలు
Samsung Galaxy S20 FE 2022 స్మార్ట్ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర కొరియన్ కరెన్సీలో 699,600 KRW. భారతదేశ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.43,500. గత మోడల్ Samsung Galaxy S20 FE 2020 వేరియంట్ ధర కంటే ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు లభించడం గమనార్హం. కొరియన్ కరెన్సీలో గత మోడల్‌తో పోల్చుకుంటే 200,000 KRW తక్కువ. (భారత కరెన్సీలో దాదాపు 12వేల400 రూపాయలు)

Rs 99 offer: రూ.16,499 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.99 ధరకే... ఆఫర్ ఒక్క రోజు మాత్రమే

ఈ లెటెస్ట్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ క్లౌడ్ వైట్, క్లౌడ్ లావెండర్ అండ్ క్లౌడ్ నేవీ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. గతేడాది మనదేశంలో Samsung Galaxy S20 FEను స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.55,999 ప్రారంభ ధరతో ప్రారంభించారు. ఇదే మోడల్ 4G వేరియంట్ భారతదేశంలో రూ. 44,999 ధరతో ప్రారంభించారు.

శామ్‌సంగ్ గెలాక్సీ S20 FE ప్రత్యేకతలు
Samsung Galaxy S20 FE 2022 వేరియంట్ ప్రత్యేకతలు దాదాపు 2020లో విడుదలైన Galaxy S20 FE 5Gకి సమానంగా ఉన్నాయి. ప్రస్తుత వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 865 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 8-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కూడా అమర్చారు. Samsung Galaxy S20 FE 2022 ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌‌ ఉంది.

CUET 2022: ఏప్రిల్ 6 నుంచి సీయూఈటీ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. కానీ ఆ విషయంలో మాత్రం నో క్లారిటీ..


5G, 4G LTE, Wi-Fi, NFCతోపాటు బ్లూటూత్ అండ్ USB టైప్-C పోర్ట్ సహాయంతోను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేయనుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీ దీంట్లో ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Samsung Galaxy, South korea, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు