స్మార్ట్‌ఫోన్ల (SmartPhones)తో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్ల వంటి అనేక ప్రొడక్ట్ మార్కెట్లలో పోటీ లేని కంపెనీగా శామ్‌సంగ్ (Samsung) రాణిస్తోంది. ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సరికొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ అన్ని విభాగాలలోనూ ప్రవేశిస్తుంది. 2018లోనే స్మార్ట్‌వాచ్‌ల తయారీలో అడుగుపెట్టిన ఈ కంపెనీ ఇప్పటికే చాలా జనరేషన్ల వాచ్‌లను లాంచ్ చేసింది. అయితే త్వరలోనే తీసుకురానున్న నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ వాచ్ 6 (Galaxy Watch 6) సిరీస్ మునుపటి వాటికి మించిన ఫీచర్లతో వస్తుందని తెలుస్తోంది. ప్రధానంగా శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్ పెద్ద బ్యాటరీలతో లాంచ్ కానుందని టాక్ నడుస్తోంది.
గెలాక్సీ వాచ్ 6 40mm, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 42mm వెర్షన్లు 300 mAh బ్యాటరీతో లాంచ్ కానున్నాయని టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఇక గెలాక్సీ వాచ్ 6 44mm, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 46mm ఏకంగా 425 mAh బ్యాటరీతో ఎంట్రీ ఇస్తాయని సమాచారం. ఇవి Galaxy Watch 5 సిరీస్ బ్యాటరీల కంటే చాలా పెద్దవి అని చెప్పవచ్చు. కొద్ది నెలల క్రితం గెలాక్సీ వాచ్ 5 40mm 284 mAh, 44mm వెర్షన్ 410 mAh బ్యాటరీలతో లాంచ్ అయ్యాయి. దీన్నిబట్టి పైన పేర్కొన్న బ్యాటరీ కెపాసిటీతో వాచ్ 6 సిరీస్ బిగ్ అప్‌గ్రేడ్ పొందనుందని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి : తగ్గేదే లే.. ఆ రికార్డు బ్రేక్ చేయనున్న ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
అప్‌కమింగ్ స్మార్ట్‌వాచ్‌లు రొటేటింగ్ బెజెల్ డిజైన్లతో రావచ్చు. ఇదే డిజైన్‌ను శామ్‌సంగ్ గతంలో దాని గెలాక్సీ వాచ్ యాక్టివ్ లైన్‌లో అందించింది. గెలాక్సీ వాచ్ 6 Pro ధర దాని కంటే ముందుగా రిలీజ్ అయిన Galaxy Watch 5 Pro ధరతో సమానంగా ఉండే అవకాశం ఉంది. రెండు సైజుల్లో రానున్న గెలాక్సీ వాచ్ 6, ఇంచుమించు గెలాక్సీ వాచ్ 5 లాంచ్ అయిన ధరలతోనే వస్తుందని అంచనా వేస్తున్నారు.
* ఆ రోజే ఆవిష్కరణ
శామ్‌సంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్‌లతో పాటు గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ను ఆగస్టులో ఆవిష్కరించనుంది. శామ్‌సంగ్ అప్‌కమింగ్ స్మార్ట్ వాచ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే కంపెనీ ఇటీవల స్మార్ట్ వాచ్‌లో విలీనం చేయగల ప్రొజెక్టర్ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది.
స్మార్ట్‌వాచ్ నుంచి కంటెంట్‌ను గోడ లేదా పైకప్పు వంటి పెద్ద ఉపరితలంపైకి ప్రొజెక్ట్ చేసే సదుపాయాన్ని శామ్‌సంగ్ తీసుకురానుందని దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వస్తే శామ్‌సంగ్ వాచ్ 6 సిరీస్ యూజర్లను బాగా ఆకట్టుకోవడం ఖాయం. మొత్తం మీద ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌వాచ్‌లు అడ్వాన్స్‌డ్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో రానున్నాయని స్పష్టమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samsung, Samsung Galaxy, Smartwatch, Tech news