స్మార్ట్‌ఫోన్ (Smartphone) తయారీ కంపెనీలు చాలావరకు 5G ఫోన్లపైనే దృష్టి పెట్టాయి. భారత్‌లో 5G నెట్‌వర్క్(5G Network) క్రమంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, తక్కువ ధరలోనే ఈ నెట్‌వర్క్ కంపాటబిలిటీకి సపోర్ట్ చేసే డివైజ్‌లను కంపెనీలు తయారు చేస్తున్నాయి. టెక్ దిగ్గజం శామ్‌సంగ్ కూడా F సిరీస్‌లో అఫర్డబుల్ 5G ఫోన్లను రూపొందిస్తోంది. అయితే ఈ సిరీస్ నుంచి వచ్చే వారం మరో మోడల్ మార్కెట్లోకి రానుంది. శామ్‌సంగ్ గెలాక్సీ F14 5G (Samsung Galaxy F14 5G) పేరుతో తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఇండియాలో లాంచ్ చేయనుందని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ F14 5G స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుందని IANS న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఫోన్ 5 nm Exynos చిప్‌సెట్‌తో మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తూ బ్రాండ్ వాల్యూ పెంచుతుందని నివేదిక పేర్కొంది. ఈ 5nm చిప్‌సెట్ Exynos 1330 అనేది మల్టీ టాస్కర్స్ కోసం రూపొందించిన ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది అత్యంత వేగంతో స్మూత్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని IANS రిపోర్ట్ వెల్లడించింది.
గెలాక్సీ F14 5G ఫోన్.. ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ కానున్న రెండో శామ్‌సంగ్ F సిరీస్ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఇంతకు ముందు జనవరిలో గెలాక్సీ F04ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజా డివైజ్‌లో 6000 mAh బ్యాటరీతో పాటు కస్టమర్లను ఆకర్షించే అనేక ఫీచర్లు ఉంటాయని IANS నివేదిక వెల్లడించింది.
ఇది కూడా చదవండి : ఉచితంగా స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు.. రూ.7 లక్షలు కాజేశాడు.. ఇదెక్కడి మోసం రా మామ!
* ధర, లభ్యత
ఇండియాలో గెలాక్సీ F14 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 కంటే తక్కువగానే ఉండొచ్చని IANS రిపోర్ట్ పేర్కొంది. కంపెనీ ఈ నెలాఖరులో ఫోన్ అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ , శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్స్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్స్‌లో ఈ డివైజ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే దీనిపై శామ్‌సంగ్ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
* A సిరీస్‌లో రెండు డివైజ్‌లు
మరోవైపు A సిరీస్‌లో శామ్‌సంగ్ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్సీ A34, గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్లను ఈ కంపెనీ మార్చి 16న లాంచ్ చేయనుంది. ఈ లేటెస్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే కొన్ని లీక్స్ ప్రకారం.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 6.4 నుంచి 6.7 అంగుళాల పొడవుతో, పెద్ద AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉండవచ్చు.
ఈ రెండింట్లో గెలాక్సీ A34 చౌకైన మోడల్. ఇది డైమెన్సిటీ 1080 చిప్‌సెట్, 48MP + 8MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో రానుంది. గెలాక్సీ A54 ఫోన్ Exynos 1380 చిప్‌సెట్, 32MP సెల్ఫీ కెమెరాతో పాటు 50MP+ 12MP + 5MP సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. అయితే కంపెనీ అధికారికంగా లాంచ్ చేసిన తర్వాతే వీటి ధర, స్పెసిఫికేషన్ల వివరాలు తెలియనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Samsung, Samsung Galaxy, Tech news