హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Repair Mode: మీ ఫోన్‌లో రిపేర్ మోడ్ ఉందా..? సాంసంగ్ యూజర్స్ లక్కీ అసలు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

Samsung Repair Mode: మీ ఫోన్‌లో రిపేర్ మోడ్ ఉందా..? సాంసంగ్ యూజర్స్ లక్కీ అసలు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

మీ ఫోన్‌లో రిపేర్ మోడ్ ఉందా..? సాంసంగ్ యూజర్స్ లక్కీ అసలు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

మీ ఫోన్‌లో రిపేర్ మోడ్ ఉందా..? సాంసంగ్ యూజర్స్ లక్కీ అసలు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

రిపేర్ మోడ్ ఆన్ చేస్తే మీ ఫోన్‌ని ఓపెన్ చేసే రిపేరు షాపు వ్యక్తులకు లిమిటెడ్ యాక్సెస్‌ మాత్రమే లభిస్తుంది. రిపేర్ మోడ్‌ను టర్న్ ఆన్ చేశాక.. ఫొటోలు, మెసేజ్‌లు, అన్ని పర్సనల్ అకౌంట్స్‌ రిపేర్ చేసే వ్యక్తికి కనిపించకుండా హైడ్ అవుతాయి. అప్పుడు మొబైల్‌లోని వ్యక్తిగత డేటా చూసేందుకు అవకాశం ఉండదు.

ఇంకా చదవండి ...

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ  సాంసంగ్‌ (Samsung) తన మొబైల్ యూజర్ల కోసం మెరుగైన ప్రైవసీ ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ రిపేర్ మోడ్‌ (Repair Mode) అనే మరొక కొత్త ప్రైవసీ ఫీచర్‌ (Privacy Feature)ని తీసుకొస్తోంది. సాధారణంగా రిపేర్‌కి మొబైల్ ఫోన్ ఇవ్వాలి అంటేనే చాలా భయమేస్తుంది. ఎందుకంటే రిపేర్ చేసే వ్యక్తి ఫోన్‌లోని పర్సనల్ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. రోజుల తరబడి రిపేర్ చేసే వ్యక్తికి ఫోన్‌ను ఇవ్వడం రిస్కుతో కూడుకున్న పని. అలాగని అందులోని మొత్తం డేటాను డిలీట్ చేసుకోలేం. ఈ సమస్యతో మొబైల్ యూజర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దీనిపై దృష్టి సారించిన సాంసంగ్‌ రిపేర్ మోడ్‌ను పరిచయం చేస్తోంది.

రిపేర్ మోడ్ ఆన్ చేస్తే మీ ఫోన్‌ని ఓపెన్ చేసే రిపేరు షాపు వ్యక్తులకు లిమిటెడ్ యాక్సెస్‌ మాత్రమే లభిస్తుంది. రిపేర్ మోడ్‌ను టర్న్ ఆన్ చేశాక.. ఫొటోలు, మెసేజ్‌లు, అన్ని పర్సనల్ అకౌంట్స్‌ రిపేర్ చేసే వ్యక్తికి కనిపించకుండా హైడ్ అవుతాయి. అప్పుడు మొబైల్‌లోని వ్యక్తిగత డేటాను వారు యాక్సెస్ చేయలేరు. యూజర్లు ఈ మోడ్ ఆన్ చేసి తమ ఫోన్‌ను నిశ్చింతగా రిపేర్‌కి ఇవ్వచ్చు. రిపేర్లకు ఫోన్స్ ఇచ్చే యూజర్లలో కొత్త ఫీచర్‌ వల్ల ఆందోళనలు తగ్గుతాయని కంపెనీ ఆశిస్తోంది. రిపేర్ మోడ్ ఫీచర్‌ను ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందిస్తామని కంపెనీ తెలిపింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ రిపేర్ మోడ్‌ను పొందే మొదటి ఫోన్స్ అని వెల్లడించింది.

ఇదీ చదవండి: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


శామ్‌సంగ్‌ సర్వీస్ సెంటర్ లేదా ఏదైనా థర్డ్-పార్టీ రిపేర్ షాప్‌కి ఫోన్‌ను ఇస్తున్నప్పుడు యూజర్లు రిపేర్ మోడ్‌ని ఉపయోగించవచ్చని శామ్‌సంగ్‌ తెలిపింది. గెలాక్సీ S21 స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫోన్‌లోని సున్నితమైన డేటా గల భాగాన్ని భద్రపరిచే ఫీచర్‌ను కూడా పొందుతారు. ఫోన్ రిపేర్ చేయించే ముందు చాలామంది తమ డేటాను బ్యాకప్ చేసి డివైజ్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటారు. రిపేర్ మోడ్ ఫీచర్‌తో ఇలాంటి సమస్యలన్నీ తీరుతాయి.

శామ్‌సంగ్‌ రిపేర్ మోడ్ ఎలా పనిచేస్తుంది

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి “బ్యాటరీ అండ్ డివైజ్‌ కేర్ (Battery and Device Care)” సెక్షన్‌లో రిపేర్ మోడ్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఆ తరువాత చేసిన తర్వాత ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. అనంతరం మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటా సెక్యూర్‌గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్ని ఫైల్స్ సురక్షితంగా ఉంటుందని నిర్ణయించుకున్న తర్వాత నే రిపేర్ షాప్ వారికి ఇవ్వాలి. అయితే, రిపేరు చేసే వారికి శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లోని అన్ని స్టాక్ యాప్‌లు కనిపిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లు వారికి ఒక ఇంటర్‌ఫేస్‌ కనిపిస్తుంది. యూజర్ తమ ఫోన్‌ని తిరిగి పొందిన తర్వాత, పిన్ లేదా రిజిస్టర్డ్ ఫింగర్ ప్రింట్ ఐడీని ఉపయోగించి దాన్ని అన్‌లాక్ చేసి సెక్యూర్ డేటాకు యాక్సెస్‌ను తిరిగి పొందవచ్చు. శామ్‌సంగ్‌ తన గెలాక్సీ S21 సిరీస్‌కి రిపేర్ మోడ్‌ను తీసుకువస్తోంది. భవిష్యత్తులో ఇతర ఫోన్‌లకు కూడా దీన్ని అందుబాటులోకి తేనుంది. ఇతర బ్రాండ్‌లు కూడా ఇలాంటి ఫీచర్‌ను అందిస్తే బాగుంటుంది.

First published:

Tags: New features, Samsung, Samsung Galaxy, Smart phone

ఉత్తమ కథలు