Home /News /technology /

SAMSUNG INTRODUCES NO COST EMI ON GALAXY S22 SERIES GALAXY Z FOLD3 AND FLIP3 IN INDIA UMG GH

Samsung Flagship Phones: శాంసంగ్ బంపరాఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్ అదిరే ఆఫర్.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్ అదిరే ఆఫర్.

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు (Smart Phone) కొనుగోలు చేయాలంటే ఒకేసారి భారీగా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిగణలోకి తీసుకున్న శాంసంగ్ (Samsung) తాజాగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి తీపి కబురు అందించింది.

ఇంకా చదవండి ...
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలంటే ఒకేసారి భారీగా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత మొత్తంలో ఒకేసారి నగదు చెల్లించే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. ఈ సమస్యను పరిగణలోకి తీసుకున్న ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తాజాగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి తీపి కబురు అందించింది. తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ (Flagship Galaxy Phones)లపై 24-నెలల నో కాస్ట్ ఈఎంఐ (24-Months No-cost EMI) ఆఫర్‌ను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఈ ఈఎంఐ ఆఫర్‌ను శాంసంగ్ తీసుకొచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ కింద కొనుగోలుదారులు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ , గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 5జీ లతోపాటు గెలాక్సీ ఎస్22 సిరీస్‌ల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్ షాప్స్‌లో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై 24-మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ తీసుకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తాజాగా తీసుకొచ్చిన నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ కింద కొనుగోలుదారులు గెలాక్సీ ఎస్22+, గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్లకు రూ.3,042 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. గెలాక్సీ ఎస్22 అల్ట్రా కోసం మాత్రం రూ. 4,584 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. వినియోగదారులు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ, గెలాక్సీ ఫ్లిప్3 5జీ ఫోన్స్ వంటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లపై కూడా 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ దక్కించుకోవచ్చు. అయితే గెలాక్సీ ఎస్22 పూర్తి ధర రూ.72,999.. గెలాక్సీ ఎస్22+ ధర రూ 84,999.. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా రూ.1,34,999.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 రూ.1,49,999, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ.84,999గా శాంసంగ్ నిర్ణయించింది. ఈ రేంజ్‌ ధరల్లో ఉన్న వీటిని ప్రస్తుత ఆఫర్ కింద మీరు నెలనెలా సరసమైన ఈఎంఐలు కడుతూ సొంతం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ట్రైన్‌లో సూపర్ ఫుడ్.. ఇస్కాన్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం


ఈ ఆఫర్ గురించి శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ కొన్ని విషయాలు వెల్లడించారు. తమ కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయం వినియోగదారులకు ఉపయోగపడేలా ఉంటాయన్నారు. ఇప్పుడు కూడా వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వారు సులభంగా ప్రీమియం ఫోన్స్ కొనుగోలు చేసేలా ప్రీమియం ఫోన్స్‌పై మునుపెన్నడూ లేని 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ ఆఫర్‌తో మరింత మంది వినియోగదారులు శాంసంగ్ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని యాక్సెస్ చేయగలుగుతారని చెప్పారు. తమ కంపెనీ ఫ్లాగ్‌షిప్, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెంచడంలోనూ ఈ ఆఫర్ సహాయపడుతుందన్నారు.



గెలాక్సీ ఎస్22 అల్ట్రాని కొనుగోలు చేసే వారు 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో పాటు చాలా ఖరీదైన గెలాక్సీ వాచ్4ని కేవలం రూ.2,999కే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ ఎస్22+ లేదా గెలాక్సీ ఎస్22ని కొనేవారు రూ.10 వేల విలువైన గెలాక్సీ బడ్స్ 2ని రూ.2,999కే దక్కించుకోవచ్చు. శాంసంగ్ తన ఇతర స్మార్ట్‌ఫోన్లపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఏయే మొబైల్స్‌పై ఆఫర్లు ఉన్నాయో మీరు చెక్ చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: EMI, Samsung, Smart phone, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు