హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Blocking Contacts: సాంసంగ్ సూపర్ ఆఫర్.. ఇక డబ్బులు లేకుండానే కాస్ట్లీ ఫోన్ కొనొచ్చు.. మీరూ ట్రై చేయండీ..!

Blocking Contacts: సాంసంగ్ సూపర్ ఆఫర్.. ఇక డబ్బులు లేకుండానే కాస్ట్లీ ఫోన్ కొనొచ్చు.. మీరూ ట్రై చేయండీ..!

సాంసంగ్ కొత్తగా బై నౌ.. పే లేటర్ ఆప్షన్

సాంసంగ్ కొత్తగా బై నౌ.. పే లేటర్ ఆప్షన్

ఫ్లాగ్‌షిప్, ఫోల్డబుల్ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి శామ్‌సంగ్ 'బై నౌ, పే లేటర్ (Buy Now, Pay Later)' అనే ఆప్షన్ పరిచయం చేసింది. ఈ కొత్త ఆప్షన్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్ (Galaxy S22 series), గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 (Galaxy Z Fold3), గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 (Galaxy Z Flip3) కొనుగోళ్లకు వర్తిస్తుంది.

ఇంకా చదవండి ...

ప్రముఖ మొబైల్స్‌ తయారీ కంపెనీ సాంసంగ్ (Samsung) తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను మధ్యతరగతి ప్రజలు సైతం కొనుగోలు చేసేలా గతంలో నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ తీసుకొస్తోంది. ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ (Flagship) ఫోన్స్‌తో పాటు ఫోల్డబుల్ (Foldable) ఫోన్స్ కూడా అందరూ సొంతం చేసుకునేలా మరొక కళ్లు చెదిరే ఆప్షన్ తీసుకొచ్చిందీ కంపెనీ. ఫ్లాగ్‌షిప్, ఫోల్డబుల్ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి శామ్‌సంగ్ 'బై నౌ, పే లేటర్ (Buy Now, Pay Later)' అనే ఆప్షన్ పరిచయం చేసింది. ఈ కొత్త ఆప్షన్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్ (Galaxy S22 series), గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 (Galaxy Z Fold3), గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 (Galaxy Z Flip3) కొనుగోళ్లకు వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులు గమనించాలి. కొనుగోలుదారులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న శామ్‌సంగ్ రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్ అందుకోవచ్చు.

బై నౌ, పే లేటర్ ఆఫర్ కింద కొనుగోలుదారులు పైన పేర్కొన్న స్మార్ట్‌ఫోన్ల మొత్తం ధరలో 60 శాతం వరకు 18 ఈఎంఐ పద్ధతిలో చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని 19వ ఈఎంఐలో బుల్లెట్ పేమెంట్‌గా చెల్లించాలి. కనీసం రూ.1.5 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్న కస్టమర్లు ఈ ఆఫర్‌కు అర్హులు అని కంపెనీ తెలిపింది. శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై జీరో డౌన్ పేమెంట్, 1 శాతం మినిమం ప్రాసెసింగ్ ఛార్జీని కూడా అందిస్తోంది. అలానే గెలాక్సీ S22 అల్ట్రా 5Gని కొనుగోలు చేసే కస్టమర్లకు Galaxy Watch 4ని రూ.2,999కే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, Galaxy S22+, Galaxy S22 5G కొనుగోలు చేసేవారికి Galaxy Buds 2ని రూ.2,999కి అందజేస్తోంది.

ఇదీ చదవండి: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


శామ్‌సంగ్ గెలాక్సీ S22 సిరీస్ ధర

కొద్ది నెలల క్రితం లాంచ్ అయిన గెలాక్సీ S22 సిరీస్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిలో ఒకటైన శామ్‌సంగ్ గెలాక్సీ S22 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.76,999గా, 8+128GB వేరియంట్ ధరను రూ.72,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.

ఇక గెలాక్సీ S22+ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ రూ.84,999 ధరతో లాంచ్ అయింది. 8GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.88,999గా ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ కూడా ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం బుర్గుండి, ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో దొరికే గెలాక్సీ S22 అల్ట్రా 12 GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ రూ.1,09,999కి లభిస్తుంది. 12 GB RAM+512GB వేరియంట్ బుర్గుండి, ఫాంటమ్ బ్లాక్ కలర్ వేరియంట్లలో రూ.1,18,999కి అందుబాటులో ఉంటుంది.

First published:

Tags: Pay later, Samsung, Samsung Galaxy, Smart phones

ఉత్తమ కథలు