Samsung: టీవీ కొంటే 15% క్యాష్‌బ్యాక్... సాంసంగ్ ఆఫర్

Samsung offer | టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటివి కొనాలనుకునేవారికి సాంసంగ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

news18-telugu
Updated: May 6, 2020, 11:56 AM IST
Samsung: టీవీ కొంటే 15% క్యాష్‌బ్యాక్... సాంసంగ్ ఆఫర్
Samsung (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరి టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే శుభవార్త. సాంసంగ్ ఇండియా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. టీవీలు, ఇతర డిజిటల్ అప్లయెన్సెస్ ప్రీ-బుక్ చేసుకున్నవారికి 15% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అన్ని సాంసంగ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. సాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో బుక్ చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

మీకు నచ్చిన ప్రొడక్ట్‌ని ప్రీ-బుక్ చేసుకొని పేమెంట్ చేస్తే లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మీ ఇంటికి వస్తువుల్ని డెలివరీ చేస్తుంది సాంసంగ్. మీ ఇంటికి దగ్గర్లో ఉన్న సాంసంగ్ షోరూమ్స్ నుంచే ఈ ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. కస్టమర్లు ఇంట్లోంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా తమకు కావాల్సిన ప్రొడక్ట్స్ బుక్ చేసుకోవడానికి ప్రీ-బుకింగ్ ఆప్షన్ అందిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. ఇక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కంపెనీ వివరించింది.

ఇవి కూడా చదవండి:

Vodafone: రోజూ 2జీబీ డేటా ఫ్రీగా ఇస్తున్న వొడాఫోన్... ఎవరికంటే

Xiaomi Mi 10: షావోమీ ఎంఐ 10 వచ్చేస్తోంది... మే 8న రిలీజ్

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 6, 2020, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading