హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart TVs: శామ్‌సంగ్ నుంచి ఫ్రేమ్ సిరీస్ స్మార్ట్ టీవీలు లాంచ్.. టీవీ కొంటే రూ. 21,490 విలువైన ఫోన్ ఫ్రీ!

Smart TVs: శామ్‌సంగ్ నుంచి ఫ్రేమ్ సిరీస్ స్మార్ట్ టీవీలు లాంచ్.. టీవీ కొంటే రూ. 21,490 విలువైన ఫోన్ ఫ్రీ!

Photo Credit : Samsung India

Photo Credit : Samsung India

Smart TVs: ఈ సరికొత్త స్మార్ట్ టీవీలు కస్టమైజబుల్ బెజెల్స్, మ్యాట్ డిస్‌ప్లే, ఆర్ట్ మోడ్, శామ్‌సంగ్ QLED టెక్నాలజీ, ఇతర స్పెసిఫికేషన్లతో రానున్నాయి. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ లగ్జరీ స్మార్ట్ టీవీల ధరలు, ప్రత్యేకలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ శామ్‌సంగ్‌ (Samsung) స్మార్ట్‌టీవీ (Smarttv) సెగ్మెంట్‌ను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేస్తూనే ఉంది. కంపెనీ ఇండియాలో వరుసగా కొత్త సిరీస్‌ స్మార్ట్‌టీవీలను విడుదల చేస్తోంది. తాజాగా ఇండియాలో ‘ఫ్రేమ్’ సిరీస్ టీవీలను లాంచ్ చేసింది. ఈ సరికొత్త స్మార్ట్ టీవీలు కస్టమైజబుల్ బెజెల్స్, మ్యాట్ డిస్‌ప్లే, ఆర్ట్ మోడ్, శామ్‌సంగ్ QLED టెక్నాలజీ, ఇతర స్పెసిఫికేషన్లతో రానున్నాయి. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ లగ్జరీ స్మార్ట్ టీవీల ధరలు, ప్రత్యేకలు తెలుసుకుందాం.

* ఫ్రేమ్ సిరీస్ టీవీల ఫీచర్లు

శామ్‌సంగ్ ఫ్రేమ్ స్మార్ట్ టీవీలు 3,840 x 2,160 పిక్సెల్‌ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే QLED డిస్‌ప్లేతో వస్తాయి. ఈ టీవీల స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 100Hz వరకు ఉంటుంది. ఇది మాట్టే డిస్‌ప్లే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్‌తో వస్తుంది. ఫ్రేమ్ టీవీల్లో 40W 2.0.2 ఛానల్ స్పీకర్‌ ఉంటుంది. దీనికి డాల్బీ అట్మోస్, అడాప్టివ్ సౌండ్+, డాల్బీ డిజిటల్ ప్లస్ MS12 5.1ch సపోర్ట్ ఉంటుంది. ఇది ఇన్‌బిల్ట్ గూగుల్ అసిస్టెంట్‌తో పనిచేసే శామ్‌సంగ్ Tizen OSతో రన్ అవుతుంది. Bixby, Alexa సపోర్ట్ వంటివి ఫ్రేమ్ టీవీల మరో ప్రత్యేకత.

మోషన్ సెన్సార్‌, ఆటోమెటిక్ స్క్రీన్ ఆన్, స్విచ్ ఆఫ్, ఐ కంఫర్ట్ మోడ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ఫీచర్‌.. వంటి లేటెస్ట్ ఫీచర్లతో ఇవి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి 3,500 ఇండెక్స్ పిక్చర్ క్వాలిటీతో క్వాంటం ప్రాసెసర్ 4K, HDR10+ అడాప్టివ్, HDR10+ గేమింగ్ సర్టిఫికేషన్, సుప్రీం UHD డిమ్మింగ్, మోషన్ ఎక్స్‌లరేటర్ టర్బో+ టెక్నాలజీ వంటివి ఈ స్మార్ట్ టీవీల అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్లు.

* ధరల వివరాలు..

శామ్‌సంగ్ ఫ్రేమ్ TV 43 అంగుళాల వేరియంట్‌ ధర రూ. 61,990గా ఉంది. ఇదే మోడల్ 50 అంగుళాల వేరియంట్ ధర రూ. 73,990 కాగా, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 91,990, 65 అంగుళాల వేరియంట్ ధర రూ. 1,27,990 వరకు ఉంది. ఈ సిరీస్‌లో టాప్ ఎండ్ వేరియంట్ అయిన 75 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 2,99,990గా ఉంది. శామ్‌సంగ్ సైట్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి : అమెజాన్ నుంచి థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ లేదా ఫ్రేమ్ టీవీని కొనుగోలు చేసే వారికి స్పెషల్ లాంచ్ ఆఫర్లు వర్తిస్తాయి. వివిధ బ్యాంకు కార్డులతో కస్టమర్లు 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్రేమ్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 7,690 విలువైన బెజెల్, రూ. 21,490 విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ A32, రూ. 9,499 విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ A03 ఫోన్లను ఉచితంగా గెల్చుకునే అవకాశం ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Samsung, Smart TV, Tech news

ఉత్తమ కథలు