హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung: శామ్‌సంగ్‌ బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్ల వివరాలివే..

Samsung: శామ్‌సంగ్‌ బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్ల వివరాలివే..

Samsung: శామ్‌సంగ్‌ బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్ల వివరాలివే..

Samsung: శామ్‌సంగ్‌ బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్ల వివరాలివే..

Samsung: శామ్‌సంగ్‌ ఇండియాలో ‘బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్’ లాంచ్ చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలపై అనేక ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. పండుగ ఆఫర్‌లో కస్టమర్లు శామ్‌సంగ్‌ టీవీలు కొనుగోలు చేస్తే వారికి విలువైన శామ్‌సంగ్‌ స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా(India)లో ఫెస్టివల్ సీజన్ సందడి మొదలైంది. దసరాకు ఇంకా సమయం ఉన్నా, వివిధ వ్యాపార సంస్థలు బిజినెస్‌ను పెంచుకునేందుకు స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్స్ (Festival Offers) అనౌన్స్ చేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం శామ్‌సంగ్‌ (Samsung) కూడా ఇండియాలో ‘బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్’ లాంచ్ చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలపై అనేక ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. పండుగ ఆఫర్‌లో కస్టమర్లు శామ్‌సంగ్‌ టీవీలు కొనుగోలు చేస్తే వారికి విలువైన శామ్‌సంగ్‌ స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ స్పెషల్ సేల్‌లో శామ్‌సంగ్‌ ప్రీమియం, లార్జ్ స్క్రీన్ నియో క్యూ ఎల్‌ఈడీ 8కె, నియో క్యూ ఎల్‌ఈడీ, క్యూ ఎల్‌ఈడీ(Neo QLED 8K, Neo QLED, QLED), ద ఫ్రేమ్ అండ్ క్రిస్టల్ 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీలు (The Frame and Crystal 4K UHD TVs), ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్లను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఉన్నాయి. ఈ టీవీలు కొనుగోలు చేయడం ద్వారా మీకు ఉచితంగా లభించే విలువైన స్మార్ట్ ఫోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

* స్మార్ట్‌ఫోన్ ఉచితం

65 అంగుళాల నియో క్యూఎల్‌ఈడీ 8కె టీవీ; 85, 75, 65, 55 అంగుళాల నియో క్యూఎల్‌ఈడీ టీవీ; 85, 75 అంగుళాల క్యూ ఎల్‌ఈడీ టీవీ; 75, 85 అంగుళాల క్రిస్టల్ 4కె యూహెచ్‌డీ టీవీ; 75 అంగుళాల ఫ్రేమ్ టీవీలలో.. ఏదైనా మోడల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.21,490 విలువ చేసే గెలాక్సీ A32 స్మార్ట్ ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు.

అలాగే 65 అంగుళాల ఫ్రేమ్ టీవీ లేదా 55 అంగుళాల క్యూ‌ఎల్‌ఈడీ టీవీ తీసుకుంటే కస్టమర్‌కు రూ.9,499 విలువ చేసే శామ్‌సంగ్‌ గెలాక్సీ A03 స్మార్ట్ ఫోన్‌ను ఫ్రీగా అందజేయనున్నారు. వీటితో పాటు 55 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీ గానీ, 50 అంగుళాల నియో క్యూఎల్ఈడీ టీవీ గానీ కొనుగోలు చేసినట్లయితే రూ.8,990 విలువ చేసే శామ్‌సంగ్‌ అల్ట్రా స్లిమ్ కెమెరాను ఉచితంగా ఇస్తారు.

* ఈ సేవలు ఉచితం

98 అంగుళాల నియో క్యూఎల్ఈడీ టీవీ కొనుగోలు చేసిన వారు కాంప్లిమెంటరీగా శామ్‌సంగ్‌ గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. రూ.1,09,999 విలువ చేసే గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌పై ఐదేళ్ల వారంటీ కాంప్లిమెంటరీగా పొందవచ్చు. అలాగే 85 అంగుళాల లేదా 75 అంగుళాల నియో క్యూఎల్‌ఈడీ కొన్న వారికి శామ్‌సంగ్‌ గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను ఉచితంగా ఆఫర్ కింద అందజేస్తారు. ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ కొనుగోలు చేసినట్లయితే దాంతో పాటు బ్యాటరీ(ధర రూ.13,900), స్కిన్ కవర్‌ను(రూ.2,000) ఇస్తారు.

ఇది కూాడా చదవండి : థ్రిల్లింగ్ ఆఫర్.. రూ.2,000కే టీవీ కొనొచ్చు.. పూర్తి వివరాలు!

ఈ బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్ ఆఫర్ శామ్‌సంగ్‌ అధికారిక ఆన్‌లైన్ షాపుతో పాటు అన్ని రిటైల్ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, కోటక్ మహింద్రా, ఆర్‌బీఎల్ బ్యాంకుల కార్డులు ఉపయోగించి వినియోగదారులు శామ్‌సంగ్‌ టీవీలు కొనుగోలు చేయొచ్చు. ఈ కార్డుల వినియోగం ద్వారా రూ.20,000 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.

శామ్‌సంగ్‌ లార్జ్ స్క్రీన్ టీవీలపై వినియోగదారులకు అమితమైన ఆసక్తి ఉన్నదని, కస్టమర్స్ ఆఫర్‌లో భాగంగా ఆ టీవీలను కొనుగోలు చేసి తమ లివింగ్ రూమ్‌లో పెట్టుకుని ఆనందంగా తమకు నచ్చిన కార్యక్రమాలను వీక్షించొచ్చని శామ్‌సంగ్‌ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ దీప్ సింగ్ తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Samsung, Smart phones, Smart TV

ఉత్తమ కథలు