టెక్నాలజీ మారిపోతోంది. ఈరోజు అప్డేట్ అయింది రేపు ఔట్‌డేట్ అవుతోంది. కొత్తపుంతలు తొక్కుతున్న టెక్నాలజీ సరికొత్త గ్యాడ్జెట్స్‌ని పరిచయం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. టెక్నాలజీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఇండియాకు వచ్చేసింది. సాంసంగ్ అధికారికంగా గెలాక్సీ ఫోల్డ్‌ను ఇండియాలో ప్రకటించింది. ప్రీ బుకింగ్స్ అక్టోబర్ 11న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20న షిప్పింగ్ మొదలవుతుంది. సాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే. మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.1,64,999 ఖర్చు చేయాల్సిందే. ఇది ఇండియాకు వచ్చిన మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్. అందుకే టెక్నాలజీ లవర్స్‌కు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాలు, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాలు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.