స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు!

ఈ రోజు రిలీజైన గ్యాడ్జెట్ రేపు ఔట్‌డేట్ అయిపోతుంది. అదే టెక్నాలజీ మహత్యం. ఇక త్వరలో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.

news18-telugu
Updated: September 5, 2018, 4:09 PM IST
స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు వస్తాయన్న రూమర్లకు సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తెరవేస్తోంది. ఈ ఏడాది మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. మడతపెట్టే ఫోన్ అంటే... గతంలో మీరు చూసిన ఫ్లిప్ ఫోన్ కాదు. ఏకంగా డిస్‌ప్లేనే మడతపెట్టేయొచ్చు. సౌత్ కొరియన్ కంపెనీ అయిన సాంసంగ్ ఈ దిశలో ముందడుగులు వేస్తోంది.

ఇక మడతపెట్టే డివైజ్ తీసుకొచ్చే సమయం దగ్గరపడింది. అలాంటి హ్యాండ్‌సెట్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నట్టు వినియోగదారుల సర్వేలో బయటపడింది. అయితే ఆ గ్యాడ్జెట్ తయారు చేయడం కష్టమైన విషయమే. మా కంపెనీ ఆ పనిని దాదాపుగా పూర్తి చేసేసింది.

డీ.జే.కోహ్, సీఈఓ, ఐటీ అండ్ మొబైల్, సాంసంగ్ ఎలక్ట్రానిక్స్


ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ని సాన్‌ ఫ్రాన్సిస్కోలో నవంబర్‌లో సాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించేందుకు సాంసంగ్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్నదానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జూలైలో ఫ్లెక్సిబుల్, అన్‌బ్రేకబుల్ ఓలెడ్ స్మార్ట్‌ఫోన్ ప్యానెల్‌కు సర్టిఫికేషన్ వచ్చిందని ప్రకటించింది కంపెనీ.
First published: September 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading