SAMSUNG HAS LAUNCHED THE 35W POWER ADAPTER DUO AT RS 2299 AND THIS ADAPTER CAN BE USED TO CHARGE TWO PHONES TOGETHER GH SSR
Samsung: శామ్సంగ్ నుంచి సరికొత్త ఛార్జర్.. ధర కూడా తక్కువే.. ఎంతమందికి ఉపయోగపడుతుందంటే..
శామ్సంగ్ ఛార్జర్
శామ్సంగ్ 35W పవర్ అడాప్టర్ డ్యుయోను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త వాల్ ఛార్జర్‌కు ఏకకాలంలో రెండు డివైజ్‌లను వేగంగా ఛార్జ్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది.
ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ శామ్సంగ్ (Samsung) భారత మార్కెట్లో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వరుసగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, హోమ్ అప్లయన్సెన్ను లాంచ్ చేస్తున్న సంస్థ.. ఇప్పుడు వీటికి అదనంగా ఆడియో ఉత్పత్తులు, పవర్‌బ్యాంకులు, అడాప్టర్లను సైతం ఆవిష్కరిస్తోంది. తాజాగా శామ్సంగ్ 35W పవర్ అడాప్టర్ డ్యుయోను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త వాల్ ఛార్జర్‌కు ఏకకాలంలో రెండు డివైజ్‌లను వేగంగా ఛార్జ్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది.
కేవలం స్మార్ట్ఫోన్లనే కాకుండా ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లను వేగంగా ఛార్జ్ చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. ఈ అడాప్టర్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ అడాప్టర్‌ను టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్‌లను ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు డివైజ్‌లను కూడా దీనితో ఛార్జ్ చేయవచ్చు.
శామ్సంగ్ అడాప్టర్ ధర
ఈ శామ్సంగ్ పవర్ అడాప్టర్ కేవలం రూ. 2,299 ధర వద్ద లభిస్తుంది. ఈ అడాప్టర్ ప్రముఖ రిటైల్ స్టోర్లు, శామ్సంగ్ అధికారిక వెబ్సైట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
శామ్సంగ్ అడాప్టర్ ఫీచర్లు
శామ్సంగ్ 35W పవర్ అడాప్టర్ డ్యుయో.. డ్యుయల్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇది యూఎస్బీ టైప్- C, సాధారణ టైప్-A పోర్ట్‌లను కలిగి ఉంటుంది. యూఎస్బీ టైప్ C PD (పవర్ డెలివరీ) 3.0 పోర్ట్ ద్వారా గరిష్టంగా 35W, యూఎస్బీ టైప్ A పోర్ట్ ద్వారా గరిష్టంగా15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. యూఎస్బీ టైప్ సీ ద్వారా ఒకే పరికరాన్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు అడాప్టర్ 35W వరకు శక్తిని సరఫరా చేస్తుందని, పీసీలను ఛార్జ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. అదనంగా శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లను 50 శాతం తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చని తెలిపింది.
శామ్సంగ్ సూపర్ ఫాస్ట్ టెక్నిక్ ద్వారా గెలాక్సీ నోట్ డివైజ్‌లు (గెలాక్సీ నోట్ 10, అంతకంటే ఎక్కువ), గెలక్సీ ఎస్ సిరీస్ (గెలాక్సీ ఎస్ 10 5జీ, అంతకంటే ఎక్కువ) స్మార్ట్ఫోన్లను సులభంగా ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. శామ్సంగ్ 35W పవర్ అడాప్టర్లోని యూఎస్బీ -A పోర్ట్ ద్వారా వీటిని చేయవచ్చు.
కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రొడక్ట్స్ తయారీపై శామ్సంగ్ దృష్టిపెట్టింది. గ్లోబల్ టెక్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లతో పాటు వేరబుల్ మార్కెట్లోనూ గణనీయమైన మార్కెట్ వాటా దక్కించుకుంది. తాజాగా కొత్తరకం డ్యుయల్ అడాప్టర్ టెక్నాలజీని సంస్థ అభివృద్ధి చేసింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.