SAMSUNG HAS LAUNCHED SMART MONITOR M8 THAT DOUBLE UP AA SMART TV AND PC HERE THE PRICE AND SPECIFICATIONS PRV GH
Samsung: శామ్సంగ్ నుంచి సరికొత్త ప్రొడక్ట్.. పీసీ, స్మార్ట్టీవీలా పనిచేసే ‘స్మార్ట్ మానిటర్ M8’ ధర, ఫీచర్లు ఇవే..
Samsung Smart Monitor M8 (Image: Twitter)
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ (Samsung) ఇండియాలో సరికొత్త టీవీలు, మానిటర్లు లాంచ్ చేస్తూ వినియోగదారులు ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ వారం భారతీయ మార్కెట్లో కొత్తగా స్మార్ట్ మానిటర్ ఎం8 (Samsung Smart Monitor M8)ని లాంచ్ చేసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ (Samsung) ఇండియాలో సరికొత్త టీవీలు, మానిటర్లు లాంచ్ చేస్తూ వినియోగదారులు ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ వారం భారతీయ మార్కెట్లో కొత్తగా స్మార్ట్ మానిటర్ ఎం8 (Samsung Smart Monitor M8)ని విడుదల చేసింది. ఈ మానిటర్ స్మార్ట్ టీవీ (Smart TV) లాగా కూడా పని చేయడం విశేషం. ఇందులో మీరు నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, డిస్నీ+హాట్‌స్టార్ వంటి ప్రముఖ యాప్‌లను యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు, దీనిని శామ్సంగ్ మొబైల్ ఫోన్‌తో రిమోట్‌గా కనెక్ట్ చేయడం ద్వారా పీసీలాగా వాడుకోవచ్చు. స్మార్ట్ మానిటర్ ఎం8లో స్టైలిష్ డిజైన్, వర్క్ మీటింగ్‌ల కోసం స్లిమ్-ఫిట్ కెమెరా అందించారు. స్మార్ట్ మానిటర్ ఎం8 మరిన్ని స్పెసిఫికేషన్లతోపాటు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ధర
ఇండియాలో శామ్సంగ్ స్మార్ట్ మానిటర్ ఎం8 (Samsung Smart Monitor M8) ధర రూ.59,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ మానిటర్‌ను శామ్సంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్, ఇతర రిటైల్ దుకాణాల ద్వారా జూన్ 15 నుంచి భారతీయ యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్ మానిటర్ ఎం8ని ప్రీ-బుకింగ్ చేసుకునే యూజర్లు రూ.11,999 విలువైన గెలాక్సీబడ్స్2, రూ.3,499 విలువైన శామ్సంగ్ స్మార్ట్ వైర్లెస్ కీబోర్డ్‌తో పాటు రూ.3,000 ఇన్స్టంట్ కార్ట్ డిస్కౌంట్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు. మరిన్ని వివరాలకు https://www.samsung.com/in/monitors/smart/smart-m8-32-inch-uhd-4k-ls32bm80guwxxl/ లింక్‌ను విజిట్ చేయవచ్చు.
* స్పెసిఫికేషన్లు
కొత్త శామ్సంగ్ స్మార్ట్ మానిటర్ ఎం8 (Samsung Smart Monitor M8)లో 32-అంగుళాల 4K డిస్ప్లే, 3840×2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో HDR 10+ సపోర్ట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి అన్ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్ అందించే శామ్సంగ్ హబ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి. అలానే ఏ యాప్ డౌన్లోడ్ చేయకుండా లేదా సైన్-అప్లు లేకుండా శామ్సంగ్ టీవీ ప్లస్ (Samsung TV Plus) సర్వీస్‌కు ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. ఎం8 డిజైన్ 11.4మిమీతో చాలా సన్నగా ఉంటుంది. డెస్క్‌పై మానిటర్ అందాన్ని పెంచే ఫ్లాట్ బ్యాక్‌ను కూడా కొనుగోలుదారులు పొందుతారు. ఫ్లాట్ బ్యాక్ వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ ఫ్లాట్ బ్యాక్‌తో మీ అవసరాలకు తగినట్లుగా మానిటర్ హైట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.
శామ్సంగ్ డెక్స్ (Samsung Dex) ఫీచర్‌తో స్మార్ట్ మానిటర్ ఎం8ని శామ్సంగ్ మొబైల్ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా పీసీకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఈ స్మార్ట్ మానిటర్లో వర్క్‌స్పేస్ యూజర్ ఇంటర్ఫేస్ను అందించారు కాబట్టి వైఫై కనెక్టివిటీ సహాయంతో వైర్‌లెస్‌గా వివిధ అప్లికేషన్లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ డ్యుయో లేదా మైక్రోసాఫ్ట్ టీమ్‌లలో ముఖ్యమైన వీడియో కాల్స్‌ను చేయడానికి హెచ్డీ కెమెరాను వాడుకోవచ్చు. ట్వీటర్లతో కూడిన 2.2-ఛానల్ 5W స్పీకర్, వైర్లెస్ ఆడియో డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి వీలుగా బ్లూటూత్ కూడా ఇందులో ఉన్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.