ఈ సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (Samsung Galaxy M53 5G), గెలాక్సీ ఎం33 5జీ (Galaxy M33 5G) స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్‌లోకి శాంసంగ్ కంపెనీ లాంచ్ చేసింది. ఫోన్ (Smart phones) విడుదల సమయంలో రెండూ ఫోన్‌లు రెండు కలర్ వేరియంట్‌లలో (Color variants) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు శాంసంగ్ కొత్తగా మరో రెండు కలర్ వేరియంట్‌లను తీసుకొచ్చింది. ముదురు రంగును ఇష్టపడే వారికి న్యూ ఎమరాల్డ్ (New Emerald Colors) బ్రౌన్ కలర్ (Brown color) స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
Samsung Galaxy M53 5G, M33 5G ఎమరాల్డ్ బ్రౌన్ కలర్
శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ, గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఎమరాల్డ్ బ్రౌన్ కలర్ (Emerald brown color) వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొత్త వేరియంట్‌లను తీసుకురావడంతో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్‌లు లభించాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఇప్పుడు డీప్ ఓసెన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్, కొత్త ఎమరాల్డ్ బ్రౌన్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం33 5జీ కూడా మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ 6GB+ 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ.26,499గా, 8GB+ 128GB వేరియంట్ ధర రూ.28,499గా ఉంది. గెలాక్సీ ఎం33 5జీ 6GB+ 128GB వేరియంట్ ధర రూ.17,999గా 8GB RAM+ 128GB వేరియంట్ ధర రూ.19,499గా ఉంది. ICICI బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలుదారులు శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీపై రూ.2,500 తక్షణ తగ్గింపు పొందవచ్చు. గెలాక్సీ ఎం33 5జీపై రూ.3,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. రెండు ఫోన్‌లను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు
.Samsung Galaxy M53 5G, M33 5G స్పెసిఫికేషన్‌లు
శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల AMOLED పంచ్ హోల్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. మరోవైపు గెలాక్సీ ఎం33 5జీ 6.6-అంగుళాల LCD డిస్‌ప్లే, ఫఫుల్ HD+ రిజల్యూషన్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రెండు ఫోన్‌లకు కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఉంది. ఎం53 5జీ ఫోన్‌లో వెనుకవైపు 108MP+ 8MP+ 2MP+ 2MP కెమెరా సెటప్, ఎం33 5జీలో వెనుకవైపు 50MP+ 5MP+ 2MP+ 2MP కెమెరా సెటప్ ఉన్నాయి. ఎం53 5జీ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌పై, ఎం33 5జీ Exynos 1280పై పని చేస్తాయి.
ఎం53 5జీలో 5,000mAh బ్యాటరీ, ఎం33 5జీలో 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. రెండు ఫోన్‌లు OneUI 4 కస్టమ్ స్కిన్‌తో Android 12 OSపై రన్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, New features, Samsung Galaxy