రోజురోజుకి మార్కెట్లో స్మార్ట్ ఉత్పత్తుల డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రధ్ద వహించేలా చేసింది. దీంతో ఫిట్నెస్ ట్రాక్ చేసే స్మార్ట్ వాచ్లకు డిమాండ్ కూడా పెరిగింది. కాబట్టి, మార్కెట్లో స్మార్ట్ వాచ్లకు పెరిగిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ వాచ్ తయారీదారులు ఈ దీపావళి సీజన్లో సరికొత్త స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పండుగ సీజన్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ వాచ్‌లపై అనేక డిస్కౌంట్లను ప్రకటించింది.
హువావే వాచ్ జిటి 2
హువావే కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్‌లో ఆఫర్ కింద - రూ .14,990లకే లభిస్తుంది. ఇది 1.39-అంగుళాల AMOLED కలర్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో ఉండే సూపర్ లాంగ్ లైఫ్ బ్యాటరీని ఒక్క సారి ఛార్జ్ చేస్తే 2 వారాల వరకు పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఇది- బ్లూటూత్ 5.1. Android 4.4 లేదా iOS 9.0కు అనుకూలమైనది. దీనితో హృదయ స్పందన రేటును నిరంతరం పర్యవేక్షించవచ్చు. ప్రొఫెషనల్ రన్నింగ్, స్విమ్మింగ్ చేసే సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఆటోమేటిక్ స్లీప్ రికగ్నిషన్, డేటా స్టాటిస్టిక్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాక, దీనిలో కాలర్ ID, SMS, ఈ–మెయిల్, క్యాలెండర్, సోషల్‌మీడియా యాప్ నోటిఫికేషన్ వంటి రిమైండర్లు అందుబాటులో ఉన్నాయి.
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే
Power Bank Tips: పవర్ బ్యాంక్ వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలివే
అమాజ్‌ఫిట్ బిప్ ఎస్
అమేజ్ఫిట్కు చెందిన అమాజ్‌ఫిట్ బిప్ ఎస్ అమోజాన్‌లో ఆఫర్ కింద- రూ .3,999లకు లభిస్తుంది. దీన్ని ఒక్క సారి చార్జ్ చేస్తే15- రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇది 1.28 అంగుళాల డిస్ప్లేతో పాటు 176 * 176 రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలో 2 బిల్ట్ ఇన్ ఎడిటెబుల్ డయల్స్, డౌన్లోడ్ చేయడానికి 40+ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఇది 5ATM నీటి నిరోధకతతో అల్ట్రా-లైట్ వెయిట్ & సన్నని బాడీతో అట్రాక్టివ్‌గా ఉంటుంది. దీనిలోని 10 స్పోర్ట్స్ మోడ్స్ ముఖ్యంగా స్లీప్ మానిటర్, దూరం, హృదయ స్పందన రేటు మొదలైన వాటిని ట్రాకింగ్ చేస్తుంది. ఇది మ్యూజిక్ కంట్రోల్, అలారం క్లాక్, రిమైండర్లు, వాతావరణ సూచన వంటి వాటిని నోటిఫికేషన్ ద్వారా రిమైండ్ చేస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2
శామ్సంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 అమెజాన్‌లో ఆఫర్ కింద- రూ .20,990లకే లభిస్తుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో రూపొందించబడిన ఈ వాచ్‌లో 24/7 యాక్టివిటీ ట్రాకింగ్,- 4 స్టేజ్ స్లీప్, కంటిన్యూయస్ HRM, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక ఇది 39 బిల్ట్ ఇన్ ట్రాకర్స్‌తో పాటు 50 మీటర్ల వాటర్ రెసిస్టన్స్తో రూపొందించబడింది. కనెక్టివిటీ పరంగా ఇది- బ్లూటూత్ 5.0 లేదా Android 5.0కు అనుకూలమైనది. దీని డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే ఇది 3.45 సెం.మీ (అనగా 1.4 అంగుళాలు) ఉంటుంది.
WhatsApp Shopping: వాట్సప్‌లో షాపింగ్ చేయొచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది
WhatsApp Payments: వాట్సప్ నుంచి డబ్బులు ఈజీగా పంపండి ఇలా
నాయిస్ ఫిట్ ఫ్యూజన్
నాయిస్ ఫిట్ ఫ్యూజన్ అమెజాన్ ఆఫర్ కింద- రూ .5,599లకే లభిస్తుంది. ఇది అద్భుతమైన 1.22 అంగుళాల ఫుల్ కలర్ కెపాసిటివ్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాక, ఇది నాయిస్ఫిట్ ఫ్యూజన్ బ్లూటూత్ బిఎల్ఈ 4.2, ఆండ్రాయిడ్ 5.0 ప్లస్, ఐఓఎస్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లతో సజావుగా పనిచేస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌తో మానిటర్ చేయడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో నాయిస్ఫిట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అదే మీరు IOS యూజర్స్ అయితే నాయిస్ ఫిట్ X యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. నాయిస్ ఫిట్ ఫ్యూజన్ 3-లో యాక్సిలరేషన్ సెన్సార్, 24 × 7 హృదయ స్పందన మానిటర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ కార్యాచరణ మరియు ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తుంది. దీన్ని తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక్క సారి చార్జ్ చేస్తే అనలాగ్ మోడ్‌లో 30 రోజుల వరకు, స్మార్ట్ మోడ్‌లో 3 రోజుల వరకు పనిచేస్తుంది.
గార్మిన్ వివోయాక్టివ్ 3
గార్మిన్ వివోయాక్టివ్ 3 అమోజాన్‌లో ఆఫర్ కింద రూ .15,990లకే లభిస్తుంది. దీనితో యోగా, రన్నింగ్ వంటి వాటిని ట్రాక్ చేయవచ్చు. అంతేకాక, 10 కంటే ఎక్కువ ప్రీలోడ్ చేసిన GPS ఇండోర్ స్పోర్ట్స్ యాప్స్ ఉపయోగించి హెల్త్ ప్రొఫైల్‌ను చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ నోటిఫికేషన్లు, లైవ్‌ట్రాక్ వంటి కనెక్ట్ చేయబడిన మరిన్ని ఫీచర్లను దీనిలో పొందవచ్చు. స్మార్ట్ వాచ్ మోడ్ దీని బ్యాటరీ లైఫ్ 8 రోజుల వరకు, జీపీఎస్ మోడ్‌లో 13 గంటల వరకు ఉంటుంది. ఇది స్టెయిన్లెస్-స్టీల్ మెటీరియల్‌తో తయారు చేయబడింది.
నాయిస్ నాయిస్ఫిట్ ఎన్డ్యూర్
ఇది ఆఫర్ కింద రూ .3,298లకు లభిస్తుంది. ఇది 1.28 అంగుళాల- వైడ్ TFT డిస్ప్లేతో ప్రకాశవంతంగా రూపొందించబడింది. ఈ వాచ్ స్టెయిన్లెస్-స్టీల్‌తో తయారు చేయబడింది. ఆండ్రాయిడ్ యూజర్స్ NoiseFit యాప్, IOS యూజర్స్ DaFit (8.0+) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాయిస్ ఫిట్‌ను ఒక్క సారి ఛార్జీ చేస్తే 20 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిలో 30 రోజుల స్టాండ్‌బై సమయం ఉంటుంది. అంతేకాక ఇది నడవండి, పరిగెత్తడం, దాటవేయడం, ఆడటం, సైక్లింగ్ చేయడం, బరువులు ఎత్తడం, యోగా చేయడం, నాయిస్ఫిట్ ఎండ్యూర్ వంటి 9 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేస్తుంది. దీంతో మీ మణికట్టు మీదనే మీ టెక్స్ట్, కాల్ నోటిఫికేషన్లు, రిమైండర్లను అందుకోవచ్చు.
నాయిస్ నాయిస్ ఎవాల్వ్ స్పోర్ట్స్
ఇది ఆఫర్ కింద- రూ .4,999లకే లభిస్తుంది. మల్టిపుల్ వాచ్ ఫేస్‌లతో వచ్చే ఈ వాచ్ 1.2 అంగుళాల రౌండ్ AMOLED ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని ద్వారా మీరు స్వైప్, ట్యాప్, రీడ్ వంటి నోటిఫికేషన్లను సులభంగా పొందవచ్చు. Android (4.4+) యూజర్లు నాయిస్ఫిట్ యాప్‌ను, IOS యూజర్లు నాయిస్ ఫిట్ పీక్ (9.0+) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాచ్‌తో 24/7 హృదయ స్పందన రేటు మానిటర్ చేయవచ్చు. వాకింగ్, రన్నింగ్, మౌంటైన్ క్లైంబింగ్, యోగా వంటి 9 స్పోర్ట్స్ మోడ్‌లను మానిటర్ చేయవచ్చు. ఈ వాచ్‌ను ఒక్క సారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు పనిచేస్తుంది. దీనితో మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్, మెసేజ్, కాల్ నోటిఫికేషన్లను సులభంగా పొందవచ్చు. Android యూజర్లు NoiseFit యాప్‌తో ఆరోగ్యం, ఫిట్నెస్ వివరాలను ట్రాక్ చేయవచ్చు.
మోబ్వోయి టిక్వాచ్ ప్రో 2020
ఇది ఆఫర్ కింద అమెజాన్‌లో- రూ .21,999లకే లభిస్తుంది. దీనిలో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీతో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్ లేయర్డ్ టెక్నాలజీ, టూ మోడ్ల ద్వారా పనిచేస్తుంది. వ్యాయామాన్ని ట్రాక్ చేయడం,- అంతర్నిర్మిత GPS, 24 గంటల హృదయ స్పందన మానిటర్, కేలరీలు బర్న్ కౌంటర్, స్పీడ్, కాడెన్స్ మానిటర్, గూగుల్ మ్యాప్ వంటివి దీనిలో అందుబాటులో ఉంటాయి. మీ ఫిట్నెస్ ట్రాక్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి టిక్స్లీప్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి. ఈ టిక్స్లీప్ యాప్ మీ నిద్రను గుర్తిస్తుంది. అంతేకాక మీ నిద్ర పురోగతిని వివరాలతో సహా రికార్డ్ చేస్తుంది.
Vivo Diwali Offer: రూ.101 ఇచ్చి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనండి... దివాళీ స్పెషల్ ఆఫర్
Oppo A15: రూ.10,000 లోపే ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
టిక్వాచ్ ఈ 2
ఇది ఆఫర్ కింద అమెజాన్‌లో రూ.11,99లకే అందుబాటులో ఉంది. టిక్వాచ్ ఈ2 స్మార్ట్‌వాచ్ గూగుల్ ఫిట్నెస్, వేర్ ఓఎస్, 5 ఎటిఎం వాటర్‌ప్రూఫ్, స్విమ్-రెడీ వంటి ఫీచర్లతో ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు అనుకూలంగా ఉంటుంది. దీనిలో 24hr హృదయ స్పందన మానిటర్, అంతర్నిర్మిత GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ స్విమ్మింగ్ పర్యవేక్షణకు బాగా పనిచేస్తుంది. ఫిట్నెస్ ట్రాక్ చేయడానికి ఇది ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు అనుకూలంగా ఉంటుంది.
ఫాజిల్ జెన్ 5
ఇది ఆఫర్ కింద అమెజాన్‌లో రూ.19,545లకే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండు ఫోన్లలోనూ పనిచేస్తాయి, గూగుల్ ఫిట్ ఉపయోగించి హృదయ స్పందన రేటుతో పాటు వర్క్ ట్రాకింగ్, డిస్టన్స్ ట్రాకింగ్ వంటి వాటిని చేయవచ్చు. 8జీబీ స్టోరేజ్, 1జీబీ ర్యామ్ మెమరీతో వచ్చే మీ స్మార్ట్‌ఫోన్‌లో థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని మానిటర్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌ను ఛార్జ్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు.- వేగవంతమైన ఛార్జింగ్‌తో గంటలో 80% చార్జింగ్ పూర్తవుతుంది.