Home /News /technology /

SAMSUNG GALAXY WATCH 4 STANDARD EDITION COMES WITH AN ALUMINIUM CASE GALAXY BUDS 2 HAVE THREE COLOUR OPTIONS MK GH

Samsung: శామ్‌సంగ్‌ నుంచి సరికొత్త గెలాక్సీ వాచ్ సిరీస్, గెలాక్సీ ఇయర్ బడ్స్ లాంచ్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియా దిగ్గజం సరికొత్త వాచ్, ఇయర్ బడ్స్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ వాచ్ 4 సిరీస్, శామ్‌సంగ్‌ గెలాక్సీ బడ్ 2 టీడబ్ల్యూఎస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన వీటిని ఎట్టకేలకు భారత విపణిలోకి తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
శామ్‌సంగ్‌ బ్రాండ్ వ్యాల్యూ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ పరికరాల్లో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న ఈ కంపెనీ.. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్ల ఉత్పత్తిలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ దక్షిణ కొరియా దిగ్గజం సరికొత్త వాచ్, ఇయర్ బడ్స్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ వాచ్ 4 సిరీస్, శామ్‌సంగ్‌ గెలాక్సీ బడ్ 2 టీడబ్ల్యూఎస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన వీటిని ఎట్టకేలకు భారత విపణిలోకి తీసుకొచ్చింది.

ఈ నెక్స్ట్ జెనరేషన్ స్మార్ట్ వాచ్ సిరీస్‌లో గెలాక్సీ వాచ్ 4 స్టాండర్డ్ ఎడిషన్, గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎడిషన్లు ఉన్నాయి. స్టెయిన్ లెస్ స్టీల్ కేస్ వీటి ప్రత్యేకత. ఇవి రెండు విభిన్న డయల్ సైజుల్లో లభ్యమవుతున్నాయి. అన్ని మోడళ్లలో బ్లూటూత్, ఎల్టీఈ వేరియంట్లు ఉన్నాయి. వాచ్‌తో పాటు లాంచ్ అయిన గెలాక్సీ బడ్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్.. AAC, SBC కోడక్ సపోర్టుతో బ్లూటూత్ 5.2 ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. భారత్‌లో ఇవి మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతున్నాయి.

గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లో.. 40 ఎంఎం బ్లూటూత్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, ఎల్టీఈ వేరియంట్ రూ.28,999గా ఉంది. ఈ రెండు మోడల్స్ పింక్, గోల్డ్, బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. 44 ఎంఎం బ్లూటూత్ వేరియంట్ ప్రారంభ ధర రూ.26,999 కాగా.. ఎల్టీఈ మోడల్ ధర రూ.31,999గా ఉంది. ఈ రెండు డివైజ్‌లు బ్లాక్, గ్రీన్, సిల్వర్ ఫినిషింగ్‌లో వస్తాయి.

గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎడిషన్ దగ్గరకొస్తే 42 ఎంఎం బ్లూటూత్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 36,999 కాగా.. 46 ఎంఎం బ్లూటూత్ వేరింయట్ ధర రూ.34,999గా కంపెనీ నిర్దేశించింది. అదే ఎల్టీఈ ఆప్షన్ ధర రూ.39,999గా నిర్ణయించింది.

గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ నాలుగు మోడల్స్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభ్యమవుతున్నాయి. శామ్‌సంగ్‌ గెలాక్సీ బడ్స్ 2 గ్రాఫైట్, వైట్, ఆలివ్ గ్రీన్, లావెండర్ ధర రూ.11,999గా సంస్థ నిర్ణయించింది. వినియోగదారులు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్, గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ ఇయర్ బడ్స్ 2 డివైజ్‌లను శామ్‌సంగ్‌ ఇండియా అధికారిక వెబ్ సైట్ నుంచి, ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఆగస్టు 30 నుంచి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. సేల్ సెప్టెంబరు 10 నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త స్మార్ట్ వాచ్ లను ముందుగా బుక్ చేసుకున్నవారు రూ.6 వేల విలువైన ఈ-వోచర్ పొందుతారు. గెలాక్సీ బడ్స్ 2ను ప్రీ-బుక్ చేసుకున్నవారు రూ. 3 వేల ఈ-వోచర్, గెలాక్సీ వాచ్ 4 సిరీస్ బుక్ చేసుకున్నవారు రూ.3 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇయర్ బడ్స్‌ సేల్స్‌కు ఎంపిక చేసిన బ్యాంకుల్లో రూ.1200 వరకు ఆఫర్ ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Samsung, Samsung Galaxy

తదుపరి వార్తలు