సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 కొనాలనుకునేవారికి శుభవార్త. ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7, ఎస్7+ కొనేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 వైఫై మోడల్ ప్రీ బుకింగ్ రిలయెన్స్ డిజిటల్లో మొదలైంది. భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్ అయిన రిలయెన్స్ డిజిటల్‌కు చెందిన స్టోర్లలో, మైజియో స్టోర్లలో, https://www.reliancedigital.in/ వెబ్సైట్లో వీటిని బుక్ చేసుకోవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 వైఫై మోడల్ ప్రారంభ ధర రూ.55,999. మరో రెండు మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ట్యాబ్ ఎస్7 ఎల్టీఈ ధర రూ.63,999 కాగా, ట్యాబ్ ఎస్7+ ఎల్టీఈ ధర రూ.79,999. హెచ్డీఎఫ్సీ కార్డులతో ప్రీబుక్ చేసే కస్టమర్లకు రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు సాంసంగ్ కీబోర్డ్ కవర్‌పై రూ.10,000 తగ్గింపు కూడా పొందొచ్చు. సెప్టెంబర్ 7 వరకు ప్రీబుక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్, మైజియో స్టోర్స్, https://www.reliancedigital.in/ వెబ్సైట్లో ప్రీబుకింగ్ చేయొచ్చు. ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీస్‌ని అందిస్తోంది రిలయెన్స్ డిజిటల్. స్టోర్ పికప్ సర్వీస్ కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.