Samsung Galaxy: శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్​7 లాంచ్​.. రూ. 4 వేలు క్యాష్ బ్యాక్.. ధర, ఫీచర్ల వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

Samsung Galaxy: ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ శామ్​సంగ్​ నుంచి మరో ట్యాబ్లెట్​​ భారత మార్కెట్​లోకి విడుదలైంది. శామ్​సంగ్ తాజాగా తన గెలాక్సీ S7 FE వైఫై మోడల్​ను లాంచ్​ చేసింది. ఇప్పటికే అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక సైట్‌లో దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో రిలీజైన LTE మోడల్‌కు తర్వాతి వర్షన్​గా ఈ మోడల్​ విడుదలైంది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ శామ్​సంగ్​ నుంచి మరో ట్యాబ్లెట్​​ భారత మార్కెట్​లోకి విడుదలైంది. శామ్​సంగ్ తాజాగా తన గెలాక్సీ S7 FE వైఫై మోడల్​ను లాంచ్​ చేసింది. ఇప్పటికే అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక సైట్‌లో దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో రిలీజైన LTE మోడల్‌కు తర్వాతి వర్షన్​గా ఈ మోడల్​ విడుదలైంది. ఈ రెండింటిలో దాదాపు ఒకేరకమైన ఫీచర్లను అందించడం విశేషం. ఇది స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీని ధర, ఇతర ఫీచర్లను పరిశీలిద్దాం.

Whatsapp tricks: టైప్ చేయకుండా మెస్సేజ్ పంపడం.. ఓపెన్ చేయకుండా చదవడం.. ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోండి..

ధర, అమ్మకం
కొత్త శామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ S7 FE Wi-Fi వేరియంట్ రూ. 41,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 4GB ర్యామ్​ + 64GB స్టోరేజ్​ ఆప్షన్​ గల సింగిల్​ వేరియంట్​లోనే లభిస్తుంది. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ టాబ్లెట్​ను అమెజాన్​ ఇండియా, శామ్​సంగ్​ అధికారిక వెబ్​సైట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభపు ఆఫర్​ కింద హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డులపై రూ. 4,000 ఇన్​స్టన్డ్ క్యాష్‌బ్యాక్, నో -కాస్ట్ ఈఎంఐ, రూ.14,200 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 10,000 కీబోర్డ్ కవరేజీ వంటి ఆఫర్లను అందిస్తోంది.

WhatsApp New Trick: ఇక నుంచి వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడొచ్చు.. దాని కోసం ఇలా చేయండి..

స్పెసిఫికేషన్లు
శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE Wi-Fi మోడల్ ఆండ్రాయిడ్ 11 పై నడుస్తుంది. ఇది 12.4 అంగుళాల TFT డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా-కోర్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇక, దీనిలో 64 జీబీ స్టోరేజీని అందించగా.. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో దీన్నీ 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఫోటోలు, వీడియోల కోసం దీని వెనుకవైపు ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాలను చేర్చింది.

Redmi 10 Prime: భారీ బ్యాటరీతో రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే

కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. వైఫై, బ్లూటూత్​ v5.2, జీపీఎస్​, యూఎస్​బీ టైప్-సి 3.2 జెన్​1 పోర్ట్‌ వంటివి అందించింది. ఆన్‌బోర్డ్ సెన్సార్ల విషయానికి వస్తే.. యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ వంటివి చేర్చింది. వీటికి అదనంగా డాల్బీ అట్మోస్ సపోర్ట్​ గల డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది. ఈ ట్యాబ్​లో 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ గల 10,090mAh బ్యాటరీని చేర్చింది.
Published by:Veera Babu
First published: