Home /News /technology /

SAMSUNG GALAXY TAB S7 FE LAUNCHED KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Samsung Galaxy Tab S7 FE: సాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్... ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Samsung Galaxy Tab S7 FE: సాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్... ధర, ఫీచర్ల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Samsung Galaxy Tab S7 FE: సాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్... ధర, ఫీచర్ల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Samsung Galaxy Tab S7 FE | సాంసంగ్ సరికొత్త ట్యాబ్లెట్ లాంఛ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థ సాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 7 సిరీస్​లో సరికొత్త ట్యాబ్​ను విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్‌ఈ 5 జి పేరుతో దీన్ని జర్మనీలో అధికారికంగా విడుదల చేసింది. సాంసంగ్ తన ఫోన్లు, టాబ్లెట్లను ఏకీకృతం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 లైనప్‌లో ఈ సరికొత్త డివైజ్​ను చేర్చింది. ఈ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ సరసమైన ధరలో లభిస్తుందని సాంసంగ్ పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి జర్మనీలో విడుదలైన ఈ ట్యాబ్​.. గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎఫ్‌ఈ 5 జి ట్యాబ్ ​మొత్తం రెండు స్టోరేజ్​ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధర విషయానికి వస్తే.. 4 జిబి/64 జిబి వేరియంట్​ € 649 (సుమారు రూ .57,800) ధర వద్ద లభిస్తుండగా.. 6 జిబి /128 జిబి మోడల్ ధరను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ టాబ్లెట్ బ్లాక్, సిల్వర్ కలర్స్​లో అందుబాటులో ఉంటుంది. సాంసంగ్ జర్మనీ వెబ్‌సైట్‌లో దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

Realme X50 Pro 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

సాంసంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు


సాంసంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్ఈ 12.4 -అంగుళాల డబ్ల్యుక్యూజిఎ టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,560 × 1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 జి SoC తో పాటు అడ్రినో 619 జిపియు ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 128 జిబి స్టోరేజ్‌ను అందిచారు. మైక్రో ఎస్​డీ కార్డ్​ సహాయంతో దీన్ని 1 టిబి వరకు విస్తరించుకోవచ్చు. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 11-ఆధారిత వన్యుఐ 3.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన పెద్ద 10,090 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Jio 4G Data Plans: మొబైల్ డేటా సరిపోవట్లేదా? జియో అందిస్తున్న 4జీ ప్లాన్స్ ఇవే

Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

కెమెరాల విషయానికొస్తే, దీని వెనుక భాగంలో 8 ఎంపి స్నాపర్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం దీని ముందు భాగంలో ప్రత్యేకంగా 5 ఎంపి షూటర్ కెమెరాను చేర్చింది. ఈ టాబ్లెట్‌లో బ్లూటూత్‌తో కూడిన ఎకెజి, డాల్బీ అట్మోస్, డిఎక్స్, ఎస్ పెన్ సపోర్ట్ ట్యూన్ డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది. కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. దీనిలో 5G SA / NSA, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై (2.4 GHz + 5 GHz), బ్లూటూత్ 5.0, GPS / GLONASS, USB టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది. ఇది అతి తర్వలోనే భారత మార్కెట్​లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Samsung, Tablet

తదుపరి వార్తలు