news18-telugu
Updated: June 9, 2020, 10:12 AM IST
Samsung Tab: సాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్ వచ్చేసింది... ధర ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)
ఇకపై ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావాలనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్‌లో కాకుండా ట్యాబ్లెట్లో వీడియోలు, సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. సాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్ మార్కెట్లోకి వచ్చేసింది. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది కంపెనీ. గతేడాది సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ అయిన ట్యాబ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ వేరియంట్. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ ఎస్ పెన్ను సపోర్ట్ చేస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ సపోర్ట్, బ్లూటూత్, డ్యూయెల్ వైఫై బ్యాండ్ లాంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.వైఫై వేరియంట్, ఎల్టీఈ వేరియంట్లో రిలీజైంది. ఈ ట్యాబ్ ప్రారంభ ధర రూ.27,999. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రీ బుకింగ్ అందుబాటులో ఉంది. జూన్ 17న సేల్ మొదలవుతుంది. వైఫై మోడల్ అమెజాన్, సాంసంగ్ వెబ్సైట్లలో మాత్రమే లభిస్తుంది. ఎల్టీఈ మోడల్‌ను రీటైల్ ఔట్లెట్స్, ఇతర ఆన్లైన్ పోర్టల్స్‌లో కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి గెలాక్సీ రూ.2,999 విలువైన గెలాక్సీ బడ్స్+ లేదా రూ.2500 విలువైన ట్యాబ్ కవర్ ఉచితంగా లభిస్తాయి.
సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 10.4 అంగుళాలుర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: సాంసంగ్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 7,040 బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+వన్ యూఐ 2.0
కలర్స్: అంగోరా బ్లూ, చిఫాన్ పింక్, ఆక్స్ఫర్డ్ గ్రే
ధర:
వైఫై వేరియంట్- రూ.27,999
ఎల్టీఈ వేరియంట్- రూ.31,999
ఇవి కూడా చదవండి:
Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు స్మార్ట్ఫోన్లు ఇవే
WhatsApp: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపండి ఇలా
Jio offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం
Published by:
Santhosh Kumar S
First published:
June 9, 2020, 10:12 AM IST