కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home), ఆన్‌లైన్ క్లాసెస్(Online Classes) కల్చర్ పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్ (Laptop), ట్యాబ్‌ల(Tabs) అమ్మకాలు(Sales) భారీగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ కొరియాకు (South Korea) చెందిన దిగ్గజ స్మార్ట్బ్రాండ్ శామ్సంగ్ (Samsung) ఓ సరికొత్త ట్యాబ్‌ను (New tab) లాంచ్ చేసింది. Galaxy Tab A8 పేరుతో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్‌ను భారత మార్కెట్లో రూ. 17,999 వద్ద ఆవిష్కరించింది. శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 గ్రే, సిల్వర్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శామ్సంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో జనవరి 17 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. ప్రారంభ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 2,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అదనంగా రూ.999 విలువ చేసే బుక్ కవర్ కూడా లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 స్పెసిఫికేషన్లు..
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 1200 x 1920 పిక్సెల్ రిజల్యూషన్‌తో 10.5 -అంగుళాల TFT డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్లీన్, స్లిప్పరీ మెటల్ బాడీని కలిగి ఉంటుంది. ఇది యూనిసోక్ టైగర్ T618 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ గల క్వాడ్-స్పీకర్ సెటప్‌ను అందించింది. ట్యాబ్ పైభాగంలో రెండు స్పీకర్లను చేర్చింది. కుడి వైపున వాల్యూమ్, పవర్ బటన్లను అందించింది.
ఇక, ఫోన్ దిగువ భాగంలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్- సీ పోర్ట్, రెండు స్పీకర్లను చేర్చింది. శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 చాలా స్లిమ్ బెజెల్‌ను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించవచ్చు. గెలాక్సీ ట్యాబ్ A8 మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
32 జీబీ స్టోరేజ్‌తో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో 4 జీబీ ర్యామ్, 128 జీబీతో 4 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. టాబ్లెట్ పెద్ద 7040mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 15W ఫాస్ట్ అడాప్టివ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇది 4 జీ ఎల్టీఈ (ఐచ్ఛికం), వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 5 ఎల్ఈ, జీపీఎస్, యూఎస్బీ 2.0 టైప్ -సి పోర్ట్ వంటివి అందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, Samsung