Home /News /technology /

SAMSUNG GALAXY TAB A7 LITE TO IBALL ITAB MOVIEZ KNOW ABOUT BEST TABLETS FOR ONLINE CLASSES SS GH

Tablets: ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్ కొనాలా? ఇవే బెస్ట్ ఆప్షన్స్

Tablets: ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్ కొనాలా? ఇవే బెస్ట్ ఆప్షన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Tablets: ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్ కొనాలా? ఇవే బెస్ట్ ఆప్షన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Bset Tablets | ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? రూ.25,000 లోపు బెస్ట్ ట్యాబ్లెట్స్ ఇవే.

కరోనా తరువాత విద్యా బోధన ఆన్‌లైన్‌కు మారింది. మహమ్మారి దశల వారీగా వ్యాప్తి చెందడంతో స్కూళ్లు, కాలేజీలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించట్లేదు. 18ఏళ్ల లోపు వారికి టీకాలు అందుబాటులోకి వచ్చి, వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు విద్యా సంస్థలు తెరిచే అవకాశాలు లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఈ విద్యా సంవత్సరం కూడా బోధన ఆన్‌లైన్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు తక్కువ ధరల్లో లభించే ట్యాబ్లెట్ల కోసం చూస్తున్నారు. కేవలం ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌లకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ఎందుకు అనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం రూ.25వేల లోపు అందుబాటులో ఉన్న టాప్-5 ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం.

1. iBall iTab MovieZ tablet


ఐబాల్ ఐట్యాబ్ మూవీజెడ్ టాబ్లెట్ కేవలం రూ.12,690 ధర వద్ద లభిస్తుంది. దీన్ని ప్రారంభంలో రూ.24,999 ధరకు లాంచ్ చేశారు. కానీ ప్రస్తుతం రూ.12,309 తగ్గింపు తర్వాత రూ.12,690 వద్ద ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐబాల్ ఐట్యాబ్ 121 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 10.1 అంగుళాల IPS FHD LED డిస్‌ప్లేను కలిగి ఉంది. 7000mAh బ్యాటరీ సామర్థ్యం, 1.6GHz + 1.2GHz ARM కార్టెక్స్- A55 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఉన్న ఈ ట్యాబ్.. ఆన్‌లైన్ క్లాసులకు సరిపోతుంది.

Amazon Price Error: రూ.96,700 విలువైన ఇన్వర్టర్ ఏసీ రూ.5900 ధరకే... ప్రైస్ ఎర్రర్‌తో లాభపడిన కస్టమర్లు

Vivo V21e 5G: రూ.24,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.4,140 ధరకే కొనండి ఇలా

2. Lenovo Tab4 8 tablet


లెనోవో ట్యాబ్4 8 టాబ్లెట్‌ అసలు ధర రూ.16,000 కాగా, ప్రస్తుతం ఇది రూ .11,490కే లభిస్తోంది. 1280 x 800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉండే 8 అంగుళాల డిస్‌ప్లే, 4850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 5 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.. వంటి ఫీచర్లు దీని సొంతం.

3. Samsung Galaxy Tab A7 Lite


శామ్‌సంగ్ నుంచి విడుదలైన గెలాక్సీ ట్యాబ్ ఏ7 మోడల్ కేవలం రూ.14,999 ధరకే లభిస్తుంది. ఇది 8.7 అంగుళాల WXGA (1,340x800 పిక్సెల్స్) TFT డిస్‌ప్లే, ఆక్టా కోర్ SoC ప్రాసెసర్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.. వంటి ఫీచర్లతో లభిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులకు బ్రాండెడ్ ట్యాబ్‌ కోసం చూసేవారు శామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 లైట్ ట్యాబ్లెట్‌ను ఎంచుకోవచ్చు.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగావకాశాలు... ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం... రిజిస్టర్ చేయండి ఇలా

Amazon Prime Subscription: 50 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి ఇలా

4. Panasonic Tab 8 HD tablet


ఈ ట్యాబ్ ధర రూ.10,499 మాత్రమే. ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువ ఖర్చు చేసి ల్యాప్‌టాప్, పీసీ కొనాల్సిన అవసరం లేదనుకునేవారు తక్కువ ధరలోనే పానసోనిక్ ట్యాబ్ 8 హెడీ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు. 8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది.

5. Lenovo Tab M10 FHD Plus tablet


లెనోవో ట్యాబ్ ఎం10 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ టాబ్లెట్ అసలు ధర రూ .35,000 వరకు ఉంది. కానీ అమెజాన్‌లో దీనిపై ఏకంగా రూ.13,001 డిస్కౌంట్ ఉంది. ఇది 1920 X 1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో, 10.3 అంగుళాల FHD డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.8 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హెలియో P22T ట్యాబ్ ప్రాసెసర్‌తో లభిస్తున్న ఈ లెనోవో ట్యాబ్‌ను రూ.21,999కు కొనుగోలు చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Online classes, Online Education, Tablet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు